Actress Laya: సినిమాల నుంచి విరామం తీసుకున్న నటి లయ, నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘తమ్ముడు’తో మరోసారి తెరపైకి వస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 4న విడుదల కాబోతుంది. నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించిన లయ ఈ సినిమా కోసం చేసిన ప్రయత్నాలు, అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
‘‘ఈ కథకి ‘తమ్ముడు’ టైటిల్ పూర్తిగా సరిపోతుంది. సినిమా చూసినవాళ్లందరూ అదే అనిపిస్తుంది. నితిన్ అక్క పాత్రలో నటించానంటే గర్వంగా ఉంది. నటన పరంగా నితిన్ చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలు కూడా సునాయాసంగా చేశారు,’’ అని లయ తెలిపారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించగా, దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడిన లయ, 2023లో భారత్‌కు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలే ఆమెకు ‘తమ్ముడు’ అవకాశాన్ని తెచ్చిపెట్టాయంటున్నారు. ‘‘జూన్‌లో ‘తమ్ముడు’ టీమ్ నుంచి కాల్ వచ్చిందీ. కథ చెప్పగానే క్యారెక్టర్ నచ్చింది. ఈ పాత్ర కోసం బరువు పెరగాలంటూ చెప్పడంతో స్వీట్స్ తింటూ ఏకంగా 7 కిలోలు బరువు పెరిగాను,’’ అని అన్నారు.

Actress Laya: అమెరికాలో ఉన్న జాబ్‌కి రాజీనామా
అమెరికాలో ఉన్న జాబ్‌కి రాజీనామా చేసి, పూర్తి స్థాయిలో సినిమా కోసం తిరిగి హైదరాబాదుకు వచ్చానని లయ వెల్లడించారు. ‘‘అవకాశాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అందుకే వచ్చిన చాన్స్‌ని వదులుకోకుండా పూర్తిగా ఫోకస్ పెట్టాను. తమ్ముడు పాత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. నా పాత్రలో స్ట్రిక్ట్‌నెస్‌తో పాటు ఆత్మీయత, అనురాగం కూడా ఉంటుంది,’’ అన్నారు.
తాను అమెరికా నటి కాదని, పక్కా హైదరాబాద్ నటి అని స్పష్టం చేశారు లయ. ‘‘అమెరికాలో ఇల్లు ఉంది కానీ సినిమాలు చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటా. ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదు. బిజినెస్ క్లాస్ టికెట్లు, స్టార్ హోటళ్లేం వద్దు. ప్రస్తుతం శివాజీగారితో చేస్తున్న సినిమా తుది దశలో ఉంది. కొత్త కథలు కూడా వింటున్నాను,’’ అని చెప్పారు.
సినిమాలకు దూరంగా ఉన్నా, మంచి పాత్రలు వస్తే మాత్రం పూర్తిగా తానుంటానని లయ స్పష్టం చేశారు. ‘తమ్ముడు’ ఆమెకు ఒక ఎమోషనల్ రీ-ఎంట్రీగా మారింది. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని బట్టే లయ మరోసారి సినీ రంగంలో రూట్ సెట్ చేస్తుందేమో చూడాలి.