Sat. Nov 15th, 2025

    Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మేకర్స్ చెప్పినట్టే ఈ మూవీ నుంచి గ్లింప్స్ (ఫస్ట్ షాట్) రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దీని గురించే మాట్లాడుకుంటోంది. ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

    బుచ్చిబాబు తన మొదటి సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకొచ్చారు. ఇప్పుడు కన్నడ సూపర్‌ స్టార్ శివరాజ్ కుమార్ ని పెద్ది ద్వారా తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆయనతో పాటుగా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, టాలీవుడ్ సీనియర్ నటులు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పెద్ది చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

     

    ram-charan-peddis-first-shot-at-an-unexpected-range-pushpas-record-breaking
    ram-charan-peddis-first-shot-at-an-unexpected-range-pushpas-record-breaking

    ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్స్ కి మెగాభిమానుల నుంచి కామన్ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చాయి. అంతేకాదు, ఈ మూవీపై భారీగానే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ షాట్ నెక్స్ట్ లెవల్‌లో ఊహించుకునేలా ఉంది. తాజాగా వచ్చిన గ్లింప్స్ లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఎవరూ ఊహించి ఉండరు. రంగస్థలం తర్వాత అంతకుమించిన పాత్ర మళ్ళీ పెద్దిలో చేస్తున్నారని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బుచ్చిబాబు మేకింగ్, చరణ్ యాక్టింగ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేయనున్నట్టు కితాబులిస్తున్నారు. రంగస్థలం మూవీలో చరణ్ చేసిన చిట్టిబాబు పాత్రకు మించేలా పెద్దిలో రోల్ ఉండబోతున్దని కామెంట్లు కనిపిస్తున్నాయి. అంతేకాదు, పుష్ప పార్ట్ 2 రికార్డ్స్ కూడా బద్దలవడం ఖాయమంటున్నారు.

    ram-charan-peddis-first-shot-at-an-unexpected-range-pushpas-record-breaking
    ram-charan-peddis-first-shot-at-an-unexpected-range-pushpas-record-breaking

    ఊరమాస్ లుక్ లో రామ్ చరణ్ మేకోవర్ సూపర్బ్ గా ఉంది. ఇక ఇందులో చరణ్ యాస, భాష, డైలాగులకు ఫ్యాన్స్ ఫ్లాటైపోయారు. గ్లింప్స్ వచ్చినప్పటి నుంచి చరణ్ లుక్ కు సంబంధించిన బెస్ట్ స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా అవి తెగ వైరలవుతున్నాయి.కాగా, ఈ చిత్రాన్ని గ్లోబల్ వైడ్‌గా 2026 మార్చ్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అధికారికంగా గ్లింప్స్ లో ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత భారీ అంచనాలతో చేసిన గేమ్ ఛేంజర్ సినిమా చరణ్‌ను బాగా డిసప్పాయింట్ చేసింది. ఆ లోటును పెద్ది మూవీతో భర్తీ చేయనున్నారని తేలిపోయింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.