Sun. Jun 7th, 2026

    Hot Tea: సాధారణంగా చాలామందికి ఉదయం నిద్ర లేవగానే వేడివేడి టీ తాగనిదే ఉదయం గడవదు. నిద్ర లేవగానే ఒక కప్పు చాయ్ తాగిన తర్వాత ఇతర పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఇలా వేడివేడి టీ మన శరీరానికి ఉత్సాహాన్ని కలిగిస్తుందని రోజంతా చాలా చురుగ్గా పనిచేసుకుంటారని భావిస్తూ ఉంటారు. అయితే చాలామందికి రోజుల్లో చాలాసార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా ప్రతిసారి టీ తాగినప్పుడు వేడివేడిగా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రతిసారి వేడి వేడి టీ తాగటం వల్ల క్యాన్సర్ బారిన పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వేడివేడి టీ తాగటం వల్ల ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి? వేడి టీ తాగటం వల్ల జరిగే అనర్థాలు ఏంటి అనే విషయానికి వస్తే..

    అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ ఫర్హాద్ ఇస్లామి నేతృత్వంలో జరిగిన అధ్యయనంలో భాగంగా పలు విషయాలు వెళ్లడయ్యాయి.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం.. 60 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా వేడి ఉన్నటువంటి టీని రోజులో 700 మిల్లీలీటర్ల కంటే ఎక్కువగా తాగే వారిలో ఎసోఫాగియల్ (అన్నవాహిక)క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయని తెలియజేశారు.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాలలో ఆహారవాహిక క్యాన్సర్ ఎనిమిదవ స్థానంలో ఉంది.

    Hot Tea: ఏడాదికి నాలుగు లక్షల మరణాలు..

    ఇలా అన్నవాహిక క్యాన్సర్ కారణంగా ప్రతి ఏడాది సుమారు నాలుగు లక్షలకు మంది పైగా మరణిస్తున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడించారు. మనం తాగే టీ కారణంగా క్యాన్సర్ రాకపోయినప్పటికీ ఆ టీ అధికంగా వేడి ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు 90 శాతం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో పలు సందర్భాలలో టీ తీసుకున్నప్పటికీ వేడివేడిగా కాకుండా కాస్త గోరువెచ్చగా టీ తాగటం వల్ల ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలం. అధిక ఉష్ణోగ్రతతో టీ తాగటం వల్ల అన్నవాహికలోని కణాలు పూర్తిగా దెబ్బతిని అవి క్యాన్సర్ కణాలుగా మారే అవకాశాలు ఉంటాయి అందుకే అధిక ఉష్ణోగ్రతతో కాకుండా 60 డిగ్రీల కంటే తక్కువ వేడితో టీ తాగటం మంచిది.