Thu. Jul 10th, 2025

    Education: ఈ ఆధునిక డిజిటల్ యుగంలో, ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడం చాలామందికి అవసరంగా మారింది. స్కూల్స్, ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు ఇలా అన్ని రంగాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే చాలా మంది పదాలు తెలిసినా, వాటిని ఎలా స్పష్టంగా పలకాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసం పరిష్కారం గానే వచ్చిందే ELSA Speak అనే ఏఐ ఆధారిత మొబైల్ యాప్.

    ELSA (English Language Speech Assistant) అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే యాప్. ఇది యూజర్ల ఉచ్ఛారణను రికార్డ్ చేసి, వాటిని డీప్ లెర్నింగ్, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ సాయంతో విశ్లేషిస్తుంది. ఏ పదాన్ని ఎలా పలకాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, గ్రామర్‌‌‌‌‌‌‌‌ లో ఎలాంటి తప్పులు చేస్తున్నామో స్పష్టంగా సూచిస్తుంది.

    learn-to-speak-with-an-ai-app-how-about
    learn-to-speak-with-an-ai-app-how-about

    Education: ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే.. 

    ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే.. తెలుగు సహా 44 భాషల్లో వివరణలు, ఫీడ్‌బ్యాక్ ఇవ్వగలగడం. అంటే, ఇంగ్లిష్‌ భాషలో మీరు చేస్తున్న తప్పుల్ని తెలుగులోనైనా అర్థం చేసుకోవచ్చు. ఇందులో 8,000కి పైగా స్పీకింగ్ లెసన్స్ ఉండగా, టోఫెల్, IELTS, జాబ్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

    యాప్ ఫీచర్లు:

    స్పష్టమైన ఉచ్ఛారణకు గైడెన్స్

    వ్యాకరణ సలహాలు

    రోజూ మాట్లాడే పదబంధాలపై ప్రాక్టీస్

    పర్సనలైజ్డ్ ఫీడ్‌బ్యాక్

    స్కోర్ కార్డ్ ద్వారా ప్రగతిని మానిటర్ చేసే సౌలభ్యం

    ఈ యాప్‌ Android మరియు iOS ప్లాట్‌ఫార్మ్‌ల్లో అందుబాటులో ఉంది. అయితే, ఉచిత వర్షన్‌లో కొంత పరిమితి ఉంటుంది. పూర్తి ఫీచర్లను వినియోగించాలంటే ప్రో వర్షన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

    ఇకమీదట ఇంగ్లీష్ మాట్లాడడంలో భయం లేదు. ఎల్సా యాప్‌ తో మాట్లాడుతూ నేర్చుకోండి, మీ ఇంగ్లీష్ భాషను మెరుగుపర్చుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ ను పెంచుకోండి!

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.