Tollywood: స్టార్ హీరోయిన్ సమంతకు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ 2021లో నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె కెరీర్ ఊహించని కష్టాల బాట పడింది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత, కొన్ని నెలలు పూర్తిగా కెమెరాలకు దూరంగా గడిపింది.
ఇక కొద్దీ రోజుల క్రితం సమంత నిర్మాతగా మారి ‘శుభం’ అనే చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇది మే 9న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ఈ విజయంతో కొంత ఊపందుకున్న సమంత, రాజ్-డీకే డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్’ లో ప్రధాన పాత్ర చేస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ చుట్టూ తాజాగా కలకలం చెలరేగుతోంది. ఈ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒకరు కోట్ల రూపాయల స్కామ్ చేశాడన్న ఆరోపణలతో సిరీస్‌ను తాత్కాలికంగా నిలిపేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తం 25 రోజులు మాత్రమే షూటింగ్ జరిగిందని, అయితే అప్పటికే బడ్జెట్ సగానికి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, సిరీస్ రద్దుకావొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Tollywood: ఎలాంటి స్కామ్ జరగలేదని స్పష్టం చేశారు.
ఈ వార్తలపై రాజ్-డీకే స్పందిస్తూ, ఎలాంటి స్కామ్ జరగలేదని స్పష్టం చేశారు. అయినా, ఒకవేళ ‘రక్త బ్రహ్మాండ్’ ఆగిపోతే మాత్రం సమంత చేతిలో ప్రస్తుతం కొత్త సినిమాలు లేవు. దీంతో, ఆమె సినీ కెరీర్ ఇక అంతమయ్యే పరిస్థితి ఏర్పడుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అలాగే, ఈ సిరీస్ రద్దయితే దర్శకుడు రాజ్ నిధిమోరు కంటే ముందు వెబ్ సిరీస్ స్పెషలిస్ట్‌గా ఉన్న రాజ్-డీకే బ్రాండ్ ఇమేజ్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. సమంత గానీ, రాజ్ గానీ దీనిపై స్పష్టమైన స్పందన ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇక వీరిద్దరి కెరీర్ ఏ దిశగా మలుపుతీసుకుంటుందో వేచి చూడాల్సిందే.