Srirama Navami: లోక రక్షకుడైన రామయ్య పండుగ శ్రీరామ నవమిని ఘనంగా జరుపుకునేందుకు దేశం సిద్ధమవుతుంది. అయోధ్య రామాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రామాలయాల్లో కూడా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఊరు వాడ సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇలా లోక రక్షకుడైన రామయ్యకు ఎంతో కీలకమైనటువంటి ఈ శ్రీరామనవమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
శ్రీరామ నవమి రోజు మనం పొరపాటున ఈ పనులు చేస్తే కనుక దరిద్రాన్ని కష్టాలను కోరి తెచ్చుకున్నట్లేనని పండితులు చెబుతున్నారు. మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడిని పూజించేటప్పుడు, రామ నవమి సమయంలో నివారించాల్సిన పనులు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.. ఈ రోజున, శ్రీరాముడిని నిష్టగా పూజించాలి. మాంసాహారాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం తింటే రామయ్యకు ఆగ్రహం వస్తుంది. తద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
శ్రీరామ నవమి నాడు మిరపకాయలు, ఉల్లిపాయలు తినడం మానుకోవాలని అంటున్నారు. ఈ పనులు చేయడం వల్ల రాముడిని, శ్రీరామ నవమిని జరుపుకునే వారిని అవమానించినట్టే పండితులు చెబుతున్నారు. ఆహారమే కాకుండా మద్యపానం, ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి. శ్రీరామ నవమి రోజున గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకండి. ఇలాంటి పనులు చేయటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. నేడు రామ జపం చేస్తూ రామయ్యను పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి.