Banana Tree: ప్రస్తుత కాలంలో మనం ఎలాంటి చిన్న పని చేసినా కూడా వాస్తు ప్రకారమే చేస్తూ ఉంటాము. ఇలా వాస్తు ప్రకారం మనం ఎలాంటి పనులు చేసిన ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ఉంటాయని భావిస్తారు. ముఖ్యంగా ఇంటి ఆవరణంలో పెంచే మొక్కల విషయంలో కూడా ఇలాంటివి ఆలోచించి మొక్కలను పెంచుతూ ఉంటారు అయితే ఇంటి ఆవరణంలో అరటి చెట్టు పెంచడం మంచిదేనా ఒకవేళ పెంచితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
మరి అరటి చెట్టు ఇంట్లో నాటడం గురించి వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే అరటి మొక్క ఇంటి ఆవరణంలో ఉండడం శుభసూచకం అని చెబుతున్నారు అరటి మొక్కను సాక్షాత్తు నారాయణడిగా భావిస్తారు. అందుకే మన ఇంటి ఆవరణంలో అరటి మొక్కను ఈశాన్య దిక్కులో నాటడం ఎంతో శుభసూచకం అయితే అరటి మొక్కను నారాయణుడిగాను భావిస్తారు కనుక అరటి మొక్క కింద తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మి నారాయణల అనుగ్రహం మనపై ఉంటాయని చెబుతారు.
ప్రతి గురువారం చెట్టును పసుపు కుంకుమతో పూజించి దీపం వెలిగించాలి. అలా చేయడం వలన గృహంలో సుఖసంపదలు కలుగుతాయి. అరటి చెట్టును ఎప్పుడైననా ఇంటి వెనుక భాగంలో నాటాలి. ఇంటి ముందు భాగంలో నాటకూడదు. ఎప్పుడైనా అరటి మొక్కను వాస్తు ప్రకారం నాటకపోయినా ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక అరటి మొక్కకు ప్రతిరోజు శుభ్రమైన నీటిని పోయాలి కానీ బట్టలు ఉతికిన నీరును గిన్నెలు కడిగిన నీటిని పోయటం శుభసూచకం కాదని పండితులు చెబుతున్నారు.