Spirituality: మనం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను పాటిస్తుంటాము. ముఖ్యంగా పూజ చేస్తున్నాము అంటే తప్పనిసరిగా దేవుడికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటాము. ఇలా దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము. అయితే దేవుడికి పెట్టిన నైవేద్యం ఎంతసేపు దేవుడు ముందు ఉంచాలి. ఎప్పుడు దానిని తీయాలి అనే విషయం గురించి చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు.
మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు దానిని ఇత్తిడి లేదా లోహపు పాత్రలో తయారు చేయడం చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న నైవేద్యాన్ని తమలపాకులో దేవుడికి పెట్టడం శుభ పరిణామంగా భావిస్తారు. ఇక దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో పూజ చేస్తున్నప్పుడు నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి కానీ ముందుగానే తయారు చేసి పెట్టుకోకూడదు.
ఇక స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత చాలామంది ఈరోజు పూజ చేసి పెడితే మరుసటి రోజు పూజ చేసే సమయంలో తీసి వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. పూజ చేసే నైవేద్యం సమర్పించిన తర్వాత కేవలం ఐదు నిమిషాల పాటు దేవుడు ముందు ఉంచి అనంతరం దానిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న నైవేద్యాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులకు పంచడం ఎంతో శుభ పరిణామం అని పండితులు చెబుతున్నారు.