Tue. Jul 8th, 2025

    Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన బబ్లీ బ్యూటీ ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించి క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. మధ్యలో కొన్ని ఫ్లాపులొచ్చినా ఇటు సౌత్ లోనో అటు బాలీవుడ్ లోనూ సినిమా, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది.

    ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీలో సబర్మతి రిపోర్టర్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. హిందీలో సబర్మతి తో బాగా బిజీ అవుతారని ప్రచారం సాగుతోంది. ఈ మూవీ హిట్ అని రాశి కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే, ఎక్కువ సమయం ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే కేటాయిస్తున్నారు.

    raashii-khanna-thats-my-personal-thing-why-talk-about-it
    raashii-khanna-thats-my-personal-thing-why-talk-about-it

    Raashii Khanna: తెలుగులో మంచి ప్రాజెక్ట్ కోసం రాశీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

    ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో రిపోర్టర్.. పెళ్లి, పిల్లల గురించి రాశిని అడిగాడు. కాసేపటి వరకూ ఈ టాపిక్ ని దాటేవేసే ప్రయత్నం చేశారు. కానీ, రిపోర్టర్ వదలకుండా పదే పదే అదే ప్రశ్న వేసేసరికి చివరికి సమాధానం చేప్పారు. సినిమా వేరు వ్యక్తిగత జీవితం వేరు. అందరిలాగే నాకు పెళ్లి, పిల్లలు కావాలి. అది నా వ్యక్తిగతం అంటూ సమాధానం ఇచ్చారు.

    అయితే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు..ఎవరైనా తన మనసులో ఉన్నారా..? వంటి విషయాలను మాత్రం బయటపెట్టలేదు. కాగా, తెలుగులో గ్యాప్ వచ్చింది. తమిళంలో హిందీలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తెలుగులో మంచి ప్రాజెక్ట్ కోసం రాశీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.