Fri. Aug 14th, 2026

    Spiritual: హిందూ సంప్రదాయాల ప్రకారం మన తెలుగు మాసంలో వచ్చే శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రావణమాసం అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన మాసం అని చెప్పాలి. ఈ నెలలో పెద్ద ఎత్తున వ్రతాలు నోములు చేస్తూ మహిళలందరూ కూడా భక్తి పారవశ్యంలో ఉంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంకు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పాలి. శుక్రవారం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు అందుకే శ్రావణ శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేస్తూ సారే పెడుతూ ఉంటారు. ఇలా అమ్మవారికి పూజలో పెట్టిన చీరను తిరిగి కట్టుకోవచ్చా? కట్టుకుంటే ఎవరు కట్టుకోవాలి? ఈ చీర కట్టుకున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదనే విషయానికి వస్తే…

    శుక్రవారం అమ్మవారికి పూజలో భాగంగా మనం పెట్టే చీర తిరిగి కట్టుకోవచ్చు అందులో ఏ విధమైనటువంటి సందేహాలు వ్యక్తం చేయాల్సిన పనిలేదని పండితులు చెబుతున్నారు. అయితే అమ్మవారికి పెట్టిన చీరను కట్టుకునే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి అమ్మవారికి పెట్టిన చీర కట్టుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే.. అమ్మవారికి పెట్టిన చీరను ఏదైనా పూజలు వ్రతాలు ఉన్న సమయంలో కట్టుకోవడం చాలా శుభప్రదం. ఈ చీరను ముత్తైదువులు కట్టుకోవాలి అలాగే ఇంటి ఆడపడుచుకు ఈ చీరను వాయనంగా ఇవ్వడం చాలా మంచిది.

    wearing saree offered to goddess Lakshmi avoid these mistakes know details
    wearing saree offered to goddess Lakshmi avoid these mistakes know details

    Spiritual: అమ్మవారి చీరను దాచి ఉంచకూడదు..

    ఇకపోతే ఈ చీరను ఇంట్లో జరిగే ఫంక్షన్లకు కాకుండా పూజలు హోమాలు సమయంలో కట్టుకోవడం శుభప్రదం. నెలసరి సమయంలోను ఇంట్లో ఏదైనా ఆశభం జరిగినప్పుడు అమ్మవారికి సమర్పించిన చీరను కట్టుకోకూడదు అదే విధంగా ఈ చీర కట్టుకొని రాత్రి పడకగదికి వెళ్ళకూడదు. పూజలో కట్టుకుని పూజ అయిన అనంతరం ఆ చీరను మార్చుకోవడం మంచిది. అయితే అమ్మవారి ప్రసాదంగా స్వీకరించిన ఈ చీరను చాలా మంది కట్టుకోకుండా దాచిపెడుతూ ఉంటారు. అలా దాచి ఉంచడం కంటే పండుగలు శుభకార్యాల సమయంలో ఆ చీరను కట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది.