Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర కూడా ఎంతో అవసరమని చెప్పాలి. ప్రతిరోజు ఏడు నుంచి 8 గంటలపాటు నిద్రపోతేనే మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలం. అయితే రాత్రి పడుకునే ముందు మనం చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన నిద్రపై పెద్ద ప్రభావమే చూపుతాయి. ఈ చిన్న తప్పులే మన నిద్రపోయే తీవ్రమైన ప్రభావాన్ని చూపడమే కాకుండా ఆరోగ్యం పై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. మరి నిద్రపోవడానికి ముందు చేయకూడని ఆ పనులు ఏంటి అనే విషయాన్నికి వస్తే..
రోజంతా అలసిపోయి బెడ్‌పైకి వెళ్లిన తర్వాత కూడా ఫోన్ చూస్తూ ఉండటం, ఆలస్యంగా భోజనం చేయడం లేదా టీ, కాఫీ తాగడం వంటి అలవాట్లు చాలామందిలో సాధారణంగా కనిపిస్తాయి. అయితే ఇవే అలవాట్లు నిద్ర పట్టకపోవడానికి, ఉదయం లేవగానే అలసటగా అనిపించడానికి కారణం కావచ్చు.ముఖ్యంగా పడుకునే ముందు మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఉపయోగించడం తగ్గించడం మంచిది. స్క్రీన్‌ను చూస్తూ ఎక్కువసేపు గడపడం వల్ల మెదడు రిలాక్స్ అవ్వడానికి సమయం పట్టవచ్చు.

Night Sleep: టీ, కాఫీ వంటి కెఫైన్ ఉన్న పానీయాలకు దూరం..
రాత్రి సమయంలో టీ, కాఫీ వంటి కెఫైన్ ఉన్న పానీయాలు తీసుకోవడం కూడా నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. అందుకే రాత్రి పడుకోవడానికి ముందు టీ కాఫీ వంటి వాటిని తాగకూడదు.అదేవిధంగా పడుకునే ముందు కడుపు నిండా భోజనం చేయడం, ఎక్కువగా కారంగా లేదా కొవ్వు పదార్థాలు తినడం కూడా కొందరికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల అజీర్ణం లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. వీలైనంత వరకు రాత్రి భోజనాన్ని తేలికగా తీసుకోవడం, పడుకునే ముందు శరీరానికి కొంత విశ్రాంతి సమయం ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా ఈ అలవాట్లను మానుకొని, ప్రశాంతమైన వాతావరణంలో పడుకోవడం వంటి చిన్న మార్పులు నిద్ర నాణ్యతకు సహాయపడవచ్చు. నిద్ర సమస్యలు తరచుగా కొనసాగుతూ ఉంటే మాత్రం సరైన కారణాన్ని తెలుసుకోవడానికి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

