Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల పరుగుల జీవితంలో వీటన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు. ఇకపోతే సాయంత్రం ఎంతో అలసిపోయి ఇంటికి వచ్చే వ్యాయామం చేసే ఓపిక కూడా చాలామందికి ఉండదు తద్వారా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు . ఇక చాలామంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు ఫోన్ పట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు అయితే వీటిని పక్కన పెట్టి రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు నడవడం వల్ల మంచి ఆరోగ్యానికి పొందించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి భోజనం చేసిన తర్వాత పది నిమిషాలు నడవడ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొట్టి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.తిన్న తర్వాత కదలకుండా కూర్చోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లేదా గ్యాస్ రీఫ్లక్స్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలా సమస్యలతో బాధపడేవారు రాత్రి భోజనం తర్వాత పది నిమిషాలు నడిస్తే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రాత్రి భోజనం తర్వాత పది నిమిషాలు నడవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి.

Gut Health: రాత్రి భోజనం తరువాత నడక అవసరం..
మనం భోజనం చేసిన తరువాత నడవడం వల్ల తిన్న ఆహారం నుంచి విడుదలైన గ్లూకోజ్‌ను ఇంధనంగా వాడుకుంటాయి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి,శరీరం చక్కెరను సమర్థవంతంగా నిర్వహించగలుగుతుంది. అదేవిధంగా పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వును కరిగించడానికి కూడా ఈ నడక ఎంతగానో దోహద పడుతుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత ప్రతిరోజు 10 నిమిషాలు నడపడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు.

