Sat. Jun 6th, 2026

    Rainy season:  వేసవికాలం పూర్తి కావడంతో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి .ఇప్పటికే పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఇలా వాతావరణంలో మార్పులు రావటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మన వెంట వస్తూనే ఉంటాయి. ఇక వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల జబ్బులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సాధారణంగా వర్షాకాలంలో నీరు పెద్ద ఎత్తున కలుషితం కావడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అంటే కొన్ని పొరపాట్లను చేయకూడదు. మరి వర్షాకాలంలో వచ్చే సమస్యలు ఏంటి వాటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని వస్తే..

    కలుషిత నీరు..

    వర్ష కాలం మొదలవడం వల్ల నీరు కలుషితం అవుతుంది అందుకే నీటిని కాంచి చల్లార్చుకుని త్రాగటం ఎంతో మంచిది. ఇక వర్షాకాలంలో బయట దొరికే మసాలా ఫుడ్ లేదా పానీపూరి వంటి వాటిని తినకపోవడం చాలా మంచిది. బయట లభించే ఆహార పదార్థాలకు వర్షాకాలంలో పూర్తిగా దూరంగా ఉండటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.

    దోమల వ్యాప్తి:

    వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలకు నిలయంగా మారుతుంది. దోమలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది దోమ కాటుకు గురి కావటం వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు రావడానికి కారణం అవుతాయి. అందుకే మన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలలో నీరు నిలవకుండా చూసుకోవాలి ఇంటి ఆవరణంలో తాగిపడేసిన కొబ్బరి బోండాలు, టైర్లు, పూల కుండీలలో నీరు నిలవకుండా జాగ్రత్తపడ్డాలి. దోమలుకుట్టకుండా దోమతెరలు వాడటం, మస్కిటో కాయిల్స్ వాడటం మంచిది.

    Rainy season: వర్షంలో తరచూ తడవటం వల్ల అనారోగ్య సమస్యలు..

    వర్షంలో తరచూ తడవటం వల్ల అనారోగ్య సమస్యలకు గురి కావడం జరుగుతుంది. అందుకే బయటకు వెళ్లి సమయంలో తప్పనిసరిగా రైన్ కోట్ లేదా గొడుగును వెంట తీసుకెళ్లడం మంచిది. అలాగే పొద్దున వండిన ఆహార పదార్థాలను రాత్రిపూట తినడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు వేడిగా ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినటం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను కూడా మనం దూరం పెట్టవచ్చు. ఇలా వర్షాకాలంలో ఈ జాగ్రత్తలను పాటించటం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా ఉండగలం.