Lizard repellent: వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో అనేక సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా బల్లుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే అంశం. వీటి సంచారం వంటగది, స్టోర్ రూమ్, గోడల మూలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. బల్లులు కొన్ని సందర్భాల్లో ఇంటిని పురుగుల నుండి రక్షిస్తాయని చెప్పినా, అవి భయానక రూపంతో, పిల్లల్ని, మహిళల్ని భయపెట్టడం అనివార్యం.
ఈ సమస్యకు పెద్దగా ఖర్చు లేకుండానే, ఇంట్లోనే ఉన్న కొన్ని సహజ పదార్థాలతో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. వాస్తవానికి బల్లులకు కొన్ని వాసనలంటే అసహనం. ఈ వాసనల ఆధారంగా కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే బల్లులను ఇంటి నుండి ఈజీగా బయటకు పంపించేయొచ్చు..
1. గుడ్డు పెంకులు:
గుడ్డు వాసన బల్లులకు అసహ్యంగా ఉంటుంది. గుడ్డు పొట్టు (షెల్)లను ఎండబెట్టి, అవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో ఉంచితే వాటిని దూరంగా ఉంచవచ్చు. తలుపుల దగ్గర, కిటికీల మూలల్లో పెట్టితే బాగా పనిచేస్తుంది.
2. వెల్లుల్లి-ఉల్లిపాయ రసం:
బల్లులు ఈ రెండు పదార్థాల వాసనను భరించలేవు. వాటి రసాన్ని తీసుకుని స్ప్రే బాటిల్‌లో నింపి బల్లుల ఉండే చోట పిచికారీ చేయాలి.

Lizard repellent: కాఫీ పౌడర్ మరియు పొగాకు:
3. కాఫీ పౌడర్ మరియు పొగాకు:
ఈ రెండింటినీ మిక్స్ చేసి చిన్న గుల్లలుగా చేసుకుని బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంచండి. ఇది వాటిని దూరంగా ఉంచుతుంది. అయితే పిల్లలు, పెంపుడు జంతువులచే తినకుండా జాగ్రత్తగా ఉంచాలి.
4. చల్లని, చీకటి ప్రదేశాలు లేకుండా జాగ్రత్త :
బల్లులు చల్లదనాన్ని ఇష్టపడతాయి. అందుకే ఆ ప్రదేశాల్లో లైట్లు వేసి, ఫ్యాన్ నడపండి. వాటికి ఇబ్బంది కలుగుతుంది.
5. పుదీనా లేదా నిమ్మరసం స్ప్రే :
ఈ పదార్థాల వాసన అంటే బల్లులకు అసహ్యం. నీటితో కలిపి స్ప్రే చేయడం ద్వారా బల్లుల సంచారాన్ని తగ్గించవచ్చు.
6. శుభ్రతే శాశ్వత పరిష్కారం:
ఇంటి శుభ్రత అత్యంత కీలకం. వంటింట్లో మిగిలిన ఆహారం లేకుండా చూసుకోవాలి. బల్లులకు ఆహారం దొరకకపోతే స్వయంగా ఇంటిని వదిలి వెళ్లిపోతాయి.
ఈ చిన్న చిట్కాలను పాటిస్తూ ఇంటిని బల్లుల నుంచి రక్షించవచ్చు. ఖరీదైన కెమికల్స్ లేకుండా, హానికరం కాని పదార్థాలతోనే ఇంటిని శుభ్రంగా, సురక్షితంగా ఉంచవచ్చు. మీరు కూడా ఈ చిట్కాలను అమలు చేసి ప్రయోజనం పొందండి.