Tholi Ekadashi: హిందువులు ఎన్నో రకాల పండుగలను చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఇలా హిందువుల పండుగలు తొలి ఏకాదశితో మొదలవుతాయి.ఇలా తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఇలా నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉండటం వల్ల ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.ఆషాడ మాసం పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ప్రతి ఏడాది తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. మరి ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శ్రీమహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించాలి.
ఈ విధంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు స్వామివారికి ప్రత్యేక పుష్పాలతో అలంకరణ చేసిన అనంతరం చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతమాచరించే వారు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు.ఇక ఏకాదశి రోజు కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకొని ఉపవాసంతో మహావిష్ణువుని పూజించడం వల్ల ఎన్నో పాపాలు తొలగిపోతాయి.
Tholi Ekadashi:
ఇలా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు మహావిష్ణువుకి పూజ చేసిన అనంతరం నైవేద్యం సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉపవాసం విడవాలి. ఇలా ఏకాదశి రోజున పూజ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు.ఇక ఈ ఏకాదశిని కొన్నిచోట్ల విత్తనాల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు రైతులందరూ కూడా తమ వ్యవసాయ పనిముట్లను అలంకరించి ఎంతో సంతోషంగా వ్యవసాయ పనులలో పాల్గొంటారు. అందుకే ఈ ఏకాదశిని విత్తనాల ఏకాదశి అని కూడా పిలుస్తారు.