Mutton: మటన్ అంటే ఇష్టపడని మాంసాహారులు ఉండరు చాలామంది మటన్ ఎంతో ఇష్టంగా తింటున్నారు ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే .ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి ఎంతో మేలును కలగచేస్తాయి. మన ఆహారంలో భాగంగా మటన్ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ మన శరీరంలో రక్త కణాలను వృద్ధి చేయడానికి దోహదపడి రక్తహీనత సమస్య లేకుండా కాపాడుతుంది.
మటన్ అధికంగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలలో వచ్చే నెలసరి సమస్యలలో నొప్పి తీవ్రతను పూర్తిగా తగ్గిస్తుంది. కండరాల పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది. ఇలా మటన్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంతకుమించి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మటన్ వారానికి ఒకసారి తీసుకునే వారిలో ఈ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ వారికి కలుగుతాయి అలా కాకుండా రెండు రోజులకు ఒకసారి మటన్ తీసుకునే వారు కూడా ఉంటారు అలాంటి వారు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
మటన్ తరచూ తీసుకోవడం వల్ల పూర్తిగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి.తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ పై ప్రభావం చూపటం వల్ల ఎన్నో రకాల గుండె సంబంధిత సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మటన్ అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధికి కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక చాలా మంది అధిక శరీర బరువు పెరగడం అది ఊబకాయానికి దారి తీయడం జరుగుతుంది. అందుకే మటన్ లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వారానికి ఒకసారి మాత్రమే ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు.