Sharvari Wagh : శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని అలరిస్తుంటుంది. ఎప్పుడూ శార్వరీ వాఘ్ తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సందడి చేస్తుంటుంది . సాస్ టచ్ తో స్టైలిష్ గా ఎలా ఉండాలో శార్వరికి తెలుసు. క్యాజువల్స్ నుండి ఎథ్నిక్‌ల వరకు, శార్వరి అన్నింటినీ చేయగలదు. ప్రతి లుక్ లోనూ ఎంతో అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ భామ.

శర్వరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో , లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుంది. తన హాట్ లుక్స్ తో ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ నటి ఫ్యాషన్ డిజైనర్ ద్వయం శాంత్ను, నిఖిల్‌లకు మ్యూజ్‌గా వ్యవహరించింది ఈ ఫోటోషూట్ కోసం అద్భుతమైన అవుట్ ఫిట్ ని ఎంచుకుంది.

శార్వరి సొగసైన నల్లటి శాటిన్ గౌనులో చాలా అందంగా కనిపించింది. ఫోటోషూట్‌కి బ్లాక్ రూమ్ లో హాట్ పోజులిచ్చి, తన అందాలను అందరికీ చూపించింది.

శార్వరి గౌను బ్లాక్ రేషమ్ థ్రెడ్‌ల తో ఎంబ్రాయిడరీ వర్క్‌ను కలిగి ఉన్న బ్లాక్ లేస్డ్ కార్సెట్‌తో వచ్చింది. బ్లాక్ శాటిన్ గౌనులో డ్రామాటిక్ ర్యాప్ స్లీవ్‌లు, క్యాస్కేడింగ్ లాంగ్ ట్రైన్ ఎత్తైన తొడ చీలిక, డీప్ నెక్ లైన్ ఆమె అందాలను స్పష్టంగా చూపించాయి.

శార్వరి తన కురులతో మధ్య పాపిట తీసుకొని లూస్ గా వదులుకుంది మేకప్ కోసం కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా పెదాలకు లిప్‌స్టిక్ పెట్టుకుని దాని గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ.
