Wed. May 13th, 2026
    Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్ బ్రాండ్ రోజా సెల్వమణి ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో వార్తల్లో నిలిచే రోజా, ఈసారి ఒక తల్లిగా తన కుమార్తె సాధించిన అంతర్జాతీయ స్థాయి విజయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికా గడ్డపై తన కూతురు అన్షు మాలిని సృష్టించిన సరికొత్త చరిత్ర ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

    ప్రముఖ ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్‌టన్ నుంచి అన్షుమాలిని కంప్యూటర్ సైన్స్ హనర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేవలం డిగ్రీ పట్టా పుచ్చుకోవడమే కాకుండా, ‘హైయెస్ట్ డిస్టింక్షన్’తో ఉత్తీర్ణురాలై తన మేధస్సును చాటుకున్నారు. అయితే అసలు సిసలైన విజయం మరొకటి ఉంది. ఈ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా భావించే ‘హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్ సీనియర్ అవార్డు’ను అన్షు దక్కించుకున్నారు. విశేషమేమిటంటే, ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా అన్షు రికార్డు సృష్టించడం విశేషం.

    roja-selvamani-anshu-becomes-the-first-indian-to-set-a-crazy-record-in-the-us-roja-cried
    roja-selvamani-anshu-becomes-the-first-indian-to-set-a-crazy-record-in-the-us-roja-cried

    Roja Selvamani: రోజా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

    గ్రాడ్యుయేషన్ వేడుకల్లో తన కుమార్తె అవార్డులు అందుకుంటుంటే చూసి రోజా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం ఒక అవార్డుతోనే ఆగకుండా.. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు, అవుట్‌స్టాండింగ్ స్టూడెంట్ లీడర్, లడ్డి అకడమిక్ ఎక్సలెన్స్ వంటి ఎన్నో పురస్కారాలను అన్షు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయాల పరంపరను చూసి రోజా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. “ఒక తల్లికి తన బిడ్డ కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించడం కంటే మించిన కానుక ఏముంటుంది?” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

    మదర్స్ డే వేళ మర్చిపోలేని గిఫ్ట్!

    యాదృచ్ఛికంగా ఈ గ్రాడ్యుయేషన్ వేడుక మదర్స్ డే సమయంలోనే జరగడంతో రోజా మరింత ఉద్వేగానికి గురయ్యారు. “నా జీవితంలో ఈ మదర్స్ డేని ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మార్చావు.. నీ ప్రయాణం నాకు గర్వకారణం” అంటూ అన్షును పొగడ్తలతో ముంచెత్తారు. ప్రస్తుతం అన్షుమాలిని అమెరికాలో సాధించిన ఈ అరుదైన గౌరవంపై నెటిజన్లు, సినీ రాజకీయ ప్రముఖులు రోజా కూతురికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజంగానే ఒక స్టార్ కిడ్ అంటే కేవలం గ్లామర్ వెనుక వెళ్లకుండా, చదువులోనూ దేశం గర్వించేలా రాణించవచ్చని అన్షు నిరూపించారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.