Thu. Jul 10th, 2025

    Nayanthara : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అంటే మొదట గుర్తొచ్చే పేరు నయనతార. ఎన్నో విజయవంతమైన సినిమాలతో సినీ ప్రేమికులను మెప్పించిన ఆమె, గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ విఫలమైనప్పటికీ దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి 2022లో వైవాహిక జీవితం ప్రారంభించింది. వీరికి కవల పిల్లలూ ఉన్నారు.

    అయితే వివాహానంతరం ఆమె జీవితం అంతగా సజావుగా సాగడం లేదన్న ఊహాగానాలు పలు సందర్భాల్లో వినిపించాయి. ఇప్పటికే సరోగసి వివాదం, అన్న పూరణి సినిమా వివాదం వంటి సంఘటనలు ఆమె చుట్టూ కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి ముందుగానే “నయనతారకు పెళ్లి తర్వాత కష్టాలు తప్పవు, విడాకుల బాట పడతారు” అని చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి.

    తాజాగా ఆమె షేర్ చేసిన షాకింగ్ పోస్ట్
    నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ లో తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ పోస్ట్ లో ఆమె ఇలా రాశారు:

    “తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది జీవితపు పెద్ద తప్పు అవుతుంది. భర్త చేసే తప్పులకు భార్య ఎందుకు బాధ్యత వహించాలి? పురుషులు సాధారణంగా మేచ్యూర్ ఉండరు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి… నేను మీ వల్ల ఇప్పటికే చాలా ఎదుర్కొన్నాను.”

    ఈ పోస్ట్ ద్వారా ఆమె ఎవరి గురించి మాట్లాడిందన్నదానిపై స్పష్టత లేకపోయినా… విఘ్నేష్ శివన్‌పై నయనతార ఈ పోస్ట్ చేశారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

    ready-for-divorce-post-viral-on-social-media
    ready-for-divorce-post-viral-on-social-media

    Nayanthara : విడాకులు ఖాయమేనా?

    విడాకులు ఖాయమేనా?
    ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “వైవాహిక జీవితంపై ఇలాంటి నెగటివ్ పోస్ట్ చేయడం అంటే ఏదో ఉందనుకోవాలి” అంటున్నారు కొందరు.

    అయితే మరోవైపు ఈ పోస్ట్ ఫిలాసఫికల్ కోటేషన్గా కూడా చూడవచ్చని, వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేదని చెబుతున్నారు.

    ఇప్పటివరకు స్పష్టత లేదు
    నయనతార లేదా విఘ్నేష్ శివన్ నుంచి ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ పోస్ట్ వల్ల ఒకప్పుడు “పర్‌ఫెక్ట్ కపుల్” అనిపించిన నయన్-విఘ్నేష్ జంట భవిష్యత్తుపై సందేహాలు ఏర్పడుతున్నాయి.

    నయనతార ఇటీవల షేర్ చేసిన పోస్ట్ ఆమె వ్యక్తిగత జీవితంలో ఏదైనా మార్పునకు సంకేతమా? లేక ఇది కేవలం భావోద్వేగపు వ్యక్తీకరణేనా? అన్నది తెలియాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడేవరకు ఇది చర్చనీయాంశంగానే మిగులుతుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.