Fri. Jul 11th, 2025

    Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ 2004లో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ యువతలో విపరీతంగా ట్రెండ్ అయింది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమా రూ.35 కోట్ల వసూళ్లను రాబట్టి భారీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంతో అప్పుడే కెరీర్ ప్రారంభించిన బన్నీ అందుకు ఎంత పారితోషికం తీసుకున్నాడన్న విషయంపై తాజాగా నిర్మాత శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శిరీష్ చెప్పిన విధంగా.. “ఆర్య సినిమా షూటింగ్ మొదలయ్యే సమయంలోనే అల్లు అర్జున్ పారితోషికం గురించి అల్లు అరవింద్ గారిని అడిగాం. అయితే ఆయన మొదట చెప్పలేదు. సినిమా పూర్తయ్యాక మళ్లీ అడిగినా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎంత పారితోషికం అడుగుతారో తెలియక టెన్షన్ పట్టేసింది,” అన్నారు.

    తర్వాత సినిమాను ప్రసాద్ ల్యాబ్ లో ప్రివ్యూలో చూపించాక కూడా అల్లు అరవింద్ గారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారని తెలిపారు. చివరికి దిల్ రాజు గారు వారి ఇంటికి వెళ్లి మళ్లీ అడిగినప్పుడు, అరవింద్ గారు ఇలా చెప్పారు.. “నైజాంలో వసూలు ఒక కోటి అయితే ₹10 లక్షలు ఇవ్వండి, రెండు కోట్లు అయితే ₹20 లక్షలు. ఐదు కోట్లు వసూలు అయితే ₹40 లక్షలు చాలు. యాభై లక్షలు వద్దు. అదే బన్నీ పారితోషికం.”

    allu-arjun-do-you-know-the-remuneration-taken-for-the-movie-arya
    allu-arjun-do-you-know-the-remuneration-taken-for-the-movie-arya

    Allu Arjun: నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకొని సహకరిస్తారు.

    ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారట. నిర్మాతల కష్టాలను అర్థం చేసుకున్న అల్లు అరవింద్, అలాగే అల్లు అర్జున్ నిర్మాతల పట్ల ఎంతో గౌరవం చూపించారని శిరీష్ చెప్పారు. “బన్నీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకొని సహకరిస్తారు. అందుకే ఈ స్థాయికి చేరుకున్నారు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

    ఇదంతా చూస్తుంటే, స్టార్ హీరోలు మొదటి దశలో ఎలా కష్టపడి ఎదిగారో స్పష్టమవుతుంది. అల్లు అర్జున్ లాంటి నటులు నిర్మాతలతో చూపే నిబద్ధత, గౌరవం కారణంగానే ఈరోజు పరిశ్రమలో నిలిచారు అనే విషయం మరోసారి రుజువైంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.