Rashmika Mandanna : భారత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ముఖ్యంగా దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై భారీగా దృష్టి సారించారు. ఎన్నో అద్భుతమైన, అసాధ్యమైన ప్రాజెక్టులను నిర్మించి ప్రజల మెప్పును పొందుతున్నారు. దేశ భద్రతకు కీలమైన అస్సామ్, అరుణాల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో సెలా టన్నెల్స్ నిర్మించి ప్రజల జీవితాలతో పాటు దేశ భద్రతను పటిష్టపరిచారు మోదీ. నార్త టు సౌత్ , ఈస్ట్ టు వెస్ట్ చాలా ప్రాంతాల్లో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్దున్నిరు. ఇదిలా ఉంటే లేటెస్టుగా నటి రష్మిక మందన ముంబైలో నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ గురించిఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అది ఎంత వైరల్ అయ్యిందంటే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఆమె వీడియోకు రిప్లై ఇచ్చేంతలా. మోదీజీ రష్మికకు రిప్లై ఇవ్వడంతో మరోసారి ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రాంతాల వారీగా పలు భాషల్లో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రజలతో కమ్యునికేషన్ మెయిన్ టైన్ చేస్తుంటారు. తాజాగా ఆయన రష్మిక చేసిన వీడియోకు చేసిన రీ-ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.. “నిజంగా.. ప్రజలను కనెక్ట్ చెయ్యడం, వారి జీవితాల్ని మెరుగుపరచడం కన్నా సంతృప్తి ఏముంటుంది? అని ప్రధాని మోదీ రష్మికకు రిప్లై ఇచ్చారు.
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ రష్మిక ఈ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఏ పార్టీ పేరునూ ప్రస్తావించకుండా అభివృద్ధికి ఓటేయండంటూ తన ఫ్యాన్స్ కు ఫాలోవర్లకు పిలుపునిచ్చింది. ” ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్.. ఇండియాలోనే అతిపెద్ద సముద్ర వంతెన. ఇది దాదాపు 22 కిలోమీటర్లు ఉంటుంది. 6 లేన్లతో దీనిని అద్భఉతంగా నిర్మించి, 2 గంటలు ప్రయాణం, 20 నిమిషాల్లో అయ్యేసా చేసింది. ఇది నిజంగా నమ్మలేకపోతున్నాం కదా.. కొన్నేళ్ల కిందటి వరకూ ఇలాంటివి మనం ఆలోచించను కూడా లేదు”అని వీడియోలో రష్మిక తెలిపింది.