Chandrakanth : టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బుల్లితెర నటుడు చంద్రకాంత్ సుసైడ్ చేసుకున్నాడు. ఈ మధ్యనే బుల్లితెర నటి పవిత్ర జయరామ్ హఠాన్మరణంతో షాక్ లోకి వెళ్లిపోయాడు చంద్రకాంత్ . ఆమె జ్ఞాపకాల నుంచి బయటపడలేని చంద్రకాంత్ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో టీవీ ఇండ్రస్టీలో ఈ సంఘటన కలకలం రేపుతోంది. పవిత్ర యాక్సిడెంట్ గురించి నిన్న మొన్నటి వరకు పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన చంద్రకాంత్.. ఎందుకిలా సెడెన్ గా సూసైడ్ చేసుకోవడంతో ఆయన బంధువులు, మిత్రులు షాకలో ఉన్నారు. పవిత్ర లేని లైఫ్ వద్దనుకునే ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు.

రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పీఎస్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలోని తన ఇంట్లో చంద్రకాంత్ ఆతమ్మహత్య చేసుకున్నాడు. పవిత్ర మరణంతో మానసికంగా చాలా కుంగిపోయాడు. అపార్ట్‌మెంట్ లోని తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడు. ఫ్రెండ్స్ చాలా సార్లు కాల్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి ఫ్లాట్‌కు వచ్చి చూస్తే ..చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకి తెలియజేశారు. చంద్రకాంత్ తండ్రి చెన్న వెంకటేశ్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు.

యిదు రోజుల క్రితమే పవిత్ర కారు ప్రమాదంలో చనిపోయింది. ఆ సమయంలో చంద్రకాంత్ అదే కారుల ఉననాడు. కానీ చంద్రకాంత్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత యాక్సిడెంట్ గురించి యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చాడు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పవిత్ర లేదని బాధతో పోస్టులు పెడుతూ వచ్చాడు.

చంద్రకాంత్ కు 2015లోనే పెళ్లైంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వారితో ఉండటం లేదు. మరోవైపు.. పవిత్రకు కూడా పెళ్లి అయ్యింది. కొన్నేళ్లుగా ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటోంది. పవిత్రకు 22 ఏళ్ల కొడుకు , 19 ఏళ్ల కూతురు ఉన్నారు. గత ఆరేళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే తమ రిలేషన్ ను అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతలోనే పవిత్ర చనిపోవడం, ఇప్పుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో.. టీవీ ఇండస్ట్రీని తీవ్ర దుఖంలో మునిగిపోయింది.