Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ . ఉన్నట్లుండి డార్లింగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. వ్యక్తిగతంగా ఇంట్రోవర్ట్ అయిన ప్రభాస్ బయట కనిపించడమే ఎక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అనే చెప్పాలి. అలాంటిది ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో అందరూ అవాక్కయ్యేలా ఓ పోస్ట్ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ రాబోతోందని అంటున్నాడు.దీంతో ఫ్యాన్స్ ఏంటా విషయం అని తెలుసుకునేందుకు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘బాహుబలి’సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పటి నుంచి ఊపిరి సలపనంతగా వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు డార్లింగ్ . గతేడాది ‘సలార్’తో భారీ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన డార్లింగ్ త్వరలో ‘కల్కి’గా రాబోతున్నాడు. జూన్ 27న బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా విడుదలకు మరో 40 రోజులు మాత్రమే ఉంది. మరి ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అంతా ఎదురుచూస్తున్న సమయంలో ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు. మా జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు జస్ట్ వెయిట్ అని ప్రభాస్ పోస్ట్ పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడంతో ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ తన భార్యను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడా అంటు రకరకాల కామెంట్లు దర్శనమిస్తున్నాయి.
నిజానికి ప్రభాస్ పెళ్లి గురించి చాలా రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ప్రతి ఏడాది తన పెళ్లిని డార్లింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. అప్పట్లో నటి అనుష్కతో ప్రభాస్ లవ్ లోఉన్నాడని..వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. ఇక ఆదిపురుష్ సినిమా సమయంలో హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఏమీ లేదని కృతి తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో డార్లింగ్ పెట్టిన పోస్ట్ తన పెళ్లి గురించే అంటూ అభిమానులు భావిస్తున్నారు. అన్నా ఈ ట్విస్ట్ ఏంటన్నా? తొందరగా చెప్పన్నా అంటూ టెన్షన్ తట్టుకోలేకపోతున్న అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.