PuriSethupathi: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొత్త చిత్రాన్ని ఘనంగా పూజా కార్యమాలతో ప్రారంభించారు. ఆల్రెడీ ఈ సినిమాలో కోలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న విషయాన్ని పూరి బృందం ప్రకటించింది. విజయ్ సరసన మలయాళ భామ సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దునియా విజయ్, టబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మెల్లగా మెయిన్ కాస్టింగ్‌ని ఫైనల్ చేసుకున్న పూరి.. తాజాగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ పూరి వరుస ఫ్లాపులతో సతమతమయ్యారు. పాన్ ఇండియా రేంజ్‌లో చేసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశను మిగిల్చాయి. దాంతో ఈసారి పూరి కి డేట్స్ ఇచ్చే హీరో ఎవరు..? అనే సందేహం అందరిలోను కలిగింది. టాలీవుడ్‌లోనే బాలకృష్ణ, గోపీచంద్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి క్రేజీ హీరోల పేర్లు వినిపించాయి. కానీ, వాళ్ళెవరూ పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదట.

PuriSethupathi: విజయ్ సేతుపతి మీద ఫోకస్ చేశాడు పూరి
దాంతో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి మీద ఫోకస్ చేశాడు. పూరి చెప్పిన కథ ఆయనకి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో నటించే ప్రధాన తారాగణమంతా ఫైనల్ అయింది. సంగీత దర్శకుడిగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఫిక్సయ్యాడు. పాన్ ఇండియా వైడ్‌గా రూపొందించనున్న పూరిసేతుపతి సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతుంది. ‘పూరి కనెక్ట్స్’ పతాకంపై పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.
అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌లోకి జెబి మోషన్ పిక్చర్స్ వారు కూడా జాయిన్ అవడం అందరిలో ఆసక్తిని కలిగించే విషయం. జెబి మోషన్ పిక్చర్స్‌పై.. జెబి నారాయణ రావు, కొండ్రొల్ల ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా చేరారు. ప్రస్తుతానికి బెగ్గర్ అనే టైటిల్‌ని మేకర్స్ పరిశీలిస్తోంది. ఇంకా అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు. చూడాలి మరి పూరి ఈ సినిమాతోనైనా సాలీడ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అని.