Guneet Monga: ఆర్ఆర్ఆర్ మూవీ లో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి ఇండియా నుంచి మొట్టమొదటి ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ మూవీ గురించి చర్చిస్తుంది. సిరి రాజకీయ ప్రముఖులందరూ కూడా ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. అయితే 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో మరో సినిమాకి కూడా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. గునిత్ మోంగా నిర్మాణంలో కార్తీక్ గుణసల్వెస్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఇండియా నుంచి అవార్డు గెలుచుకున్న రెండవ సినిమాగా ఇది నిలిచింది. ఇక ఈ సినిమాని నిర్మించిన గునిత్ మోంగా ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఈమె గురించి తెలుసుకోవడానికి గూగుల్ లో విపరీతంగా వెతుకుతున్నారు.
గునిత్ కూడా పాపులర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఆమెకు ఇది రెండవ ఆస్కార్ అవార్డు కావడం విశేషం. గతంలో పీరియడ్స్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింకి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తమిళంలో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సూరరై పోట్రూకి ఆమె సహ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్లికట్టు, విసారనై సినిమాలకి కూడా ఆమె సహ నిర్మాతగా వ్యవహరించింది. హిందీలో లంచ్ బాక్స్ అనే సినిమాని నిర్మించింది. అలాగే అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ ఆఫ్ వస్సీపూర్ సినిమాకి కూడా ఆమె సహ నిర్మాత కావడం విశేషం.
ఆమె సహనిర్మాత నిర్మాతగా వ్యవహరించిన సినిమాలలో ఒక్క గ్యాంగ్ ఆఫ్ వస్సీపూర్ తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా ఇండియా నుంచి ఆస్కార్ కోసం నామినేట్ అయిన చిత్రాల జాబితాలో ఉండడం విశేషం. దీంతో గునిత్ మింగా సినిమాల ట్రాక్ చూసుకుంటే ఆమె మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అని అర్ధం అవుతుంది. అయితే ఆర్ఆర్ఆర్ కి అవార్డు రావడం కారణం అయిన, సామాజిక అంశాలని కథా వస్తువులుగా తీసుకొని సినిమాలు చేస్తూ రెండు ఆస్కార్ అవార్డులని గెలుచుకున్న గునిత్ మోంగా కూడా మహిళగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి.