Kiara Advani: బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ ఇప్పటికే బోల్డ్ సీన్స్ చేసి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంకాస్త డేర్ చేసి నెగిటిష్ రోల్ చేయడానికి ఒప్పుకుందట. అంతేమరి ఇక్కడ నిలబడాలంటే ఛాలెంజింగ్ రోల్స్ కోసమే పాకులాడాలి. లేదంటే పోటీని తట్టుకోవడం చాలా కష్టం. తెలుగులో కియారా అద్వానీ భరత్ అనే నేను, వ్వినయ విధేయ రామ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా బిజీ అయింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
కబీర్ సింగ్, లస్ట్ స్టోరీస్ లలో కియారా చేసిన ఇంటిమేట్ సీన్స్ దేశం అంతా మాట్లాడుకునేలా చేశాయి. ఎంత తెగింపు ఉంటే కియారా ఇలాంటి సీన్స్ చేస్తుందీ.. అని చెపుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే దాదాపు నాలుగైదేళ్ళు బాలీవుడ్‌లో కియారా నంబర్ 1 ప్లేస్ లో నిలబడింది. కియారా ఏ సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దాంతో నిర్మాతలు కియారా వైపే చూశారు.
Kiara Advani: ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా
ఇక ఇటీవల కియారా అద్వానీ పెళ్లి చేసుకొని సినిమాలకి కొంత బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ కోసం సైన్ చేస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్.టి.ఆర్ హీరోలుగా వార్ 2 కి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది.
ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జంటగా కియారా అద్వానీని ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. అయితే, ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్. కాబట్టి, కియారా అద్వానీకి పర్ఫార్మెన్స్ పరంగా మంచి స్కోప్ ఉంది. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ భాషలలో హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి పాత్రలలో అయితే తమ టాలెంట్ చూపించవచ్చునని ఛాలెంజింగ్‌గా తీసుకోవచ్చునని ఒప్పుకుంటున్నారు. మరి ఈ నెగిటివ్ రోల్‌లో కియారా ఎలా చేస్తుందో చూడాలి. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.