Friday: మన హిందూ సంప్రదాయాల ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుక్రవారం మహాలక్ష్మికి పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతి ఒక్కరు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం శుక్రవారం పెద్ద ఎత్తున అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. అయితే మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం సాయంత్రం ఈ చిన్న పనులు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సకల సంపదలకు అధిపతి అవుతారు. మరి శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు ఏంటనే విషయానికి వస్తే..
శుక్రవారం సాయంత్ర సమయంలో ఇంట్లో చీకటిగా ఉండకూడదు ఇల్లు మొత్తం వెలుగులతో నిండి ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి అవుతాము. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా దీపాలను వెలిగించడం మంచిది. ఇలా రెండు వైపులా వెలిగించలేని వారు ఇంటి గుమ్మం కుడి వైపు వెలిగించడం మంచిది. ఈ దీపం దుష్టశక్తులను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకుంటుంది.
శుక్రవారం అమ్మవారి చిత్రపటానికి పూజ చేసి నెయ్యితో దీపం వెలిగించాలి అయితే దీపం వెలిగించడానికి తామర వత్తులను ఉపయోగించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా పూజ చేసిన అనంతరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం మంచిది. ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక శుక్రవారం సాయంత్రం తులసి కోట ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో దీపం కింద పువ్వులు లేదా అక్షతలు వేసి వెలిగించడం మంచిది.

Friday Pooja : ఈశాన్య దిశలో దీపం వెలిగించడం..
ఈ మూడు చోట్ల మాత్రమే కాకుండా ఈశాన్య మూలంలో కూడా శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించడం మంచిది. ఈశాన్యంలో ఒక చిన్న ప్రమిదలో నూనె వేసి దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి అంత శుభము కలుగుతుంది. వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక శుక్రవారం సాయంత్రం వంటగదిని శుభ్రం చేసి వంట గదిలో దీపం వెలిగించడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. అయితే దీపం వెలిగించే సమయంలో కచ్చితంగా నేలపై కాకుండా దీపం కింద ఆధారంగా పువ్వులు లేదా చిన్న ప్లేట్,పువ్వులను పెట్టి దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు దీపపు వత్తి తూర్పు ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవడ మంచిది.

