Mouth Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధి చాప కింది నీరులా పాకిపోతోంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో అధికారులు క్యాన్సర్ పట్ల అవగాహన చేపడుతున్నారు. క్యాన్సర్ అనేది రాత్రికి రాత్రే వృద్ధి చెందే సమస్య కాదు ముందుగానే మన బాడీ కొన్ని సంకేతాలను మనకు తెలియజేస్తుంది. వీటిని కనుక గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదిస్తే కనుక ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఇటీవల కాలంలో నోటి క్యాన్సర్ మెడ క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. నోటి క్యాన్సర్ ఎక్కువగా సిగరెట్ పొగాకు గుట్కా వంటి వాటిని తీసుకునే వారిలో అధికంగా ఉంటుంది.
ఇక నోటి క్యాన్సర్ ను ముందస్తుగానే మన శరీరం కొన్ని లక్షణాలు ద్వారా తెలియజేస్తుంది . మరి నోటి క్యాన్సర్ తెలియచేసే ఆ లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే.. చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా నోటిపూత సమస్యతో బాధపడుతూ ఉంటారు .అయితే ఇది చిన్న సమస్య అని చాలామంది దానిపై శ్రద్ధ చూపించరు కానీ కొన్నిసార్లు నోటిపూత కూడా క్యాన్సర్ రావడానికి కారణం కావచ్చని, ఇది కూడా క్యాన్సర్ సంకేతమేనని చెబుతున్నారు . రెండు వారాలకు మించి నోటిలో పుండ్లు కనుక ఉన్నట్లయితే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని తెలియజేస్తున్నారు.

Mouth Cancer: గొంతు బొంగురుపోవడం..
నోటి లోపల తెల్లటి లేదా ఎరుపు రంగు మచ్చలు, తగ్గని నోటి పూత, కారం తింటున్నప్పుడు మంట, బుగ్గ మందం కావడం లేదా నోరు తెరవడం క్రమంగా తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.నిరంతర గొంతు బొంగురుపోవడం లేదా గొంతులో మార్పులు రావడం.ఏదైనా నమిలి మింగేటప్పుడు నొప్పిగా ఉంటుంది.దంతాల సమస్య లేకుండా అకస్మాత్తుగా రక్తం కారడం లేదా పళ్ళు లూజ్ కావడం. అదేవిధంగా నాలుక, పెదవులపై తిమ్మిరి ఏర్పడటం మెడపై గడ్డలు ఏర్పడటం కూడా నోటి క్యాన్సర్ కు కారకాలు. ఇలాంటి లక్షణాలు కనుక మీలో కనిపించినట్లు అయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది అదేవిధంగా 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా తరచూ రైతు పరీక్షలు చేయించుకోవడం మంచిది.

