Mon. Jul 27th, 2026

    Guru Purnima 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి అమావాస్య పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని ఆషాడ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మరి ఈ ఏడాది ఆషాడ పౌర్ణమి ఎప్పుడు? పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు చేయకూడని పనులు ఏంటి? పౌర్ణమి తిథి ,పూజ విధానం ఏంటి అని విషయాన్ని విషయానికి వస్తే..ఈ ఏడాది ఆషాడ మాసంలో పౌర్ణమి తిథి జూలై 28వ తేదీ సాయంత్రం 6:18 గంటలకు ప్రారంభమై జూలై 29వ తేదీ రాత్రి 8:05 గంటలకు పూర్తి అవుతుంది. ఈ ప్రకారం మనం జూలై 29వ తేదీ పౌర్ణమిని జరుపుకుంటాము.

    జూలై 29వ తేదీ పౌర్ణమి రావడంతో ఉదయమే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ పౌర్ణమి రోజు విష్ణుదేవుని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. విష్ణుమూర్తి చిత్రపటాన్ని అలంకరించి పసుపు పువ్వులు, తులసి దళాలు, చందనం, పండ్లు సమర్పించి నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. పూజ అనంతరం విష్ణు సహస్ర పారాయణం చదవాలి.ఓం నమో నారాయణాయ మంత్రం లేదా శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఇతర స్తోత్రాలను జపించడం మంచిది. ఇక ఆషాడ పౌర్ణమి రోజు దానధర్మాలు చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని భావిస్తారు అందుకే మన స్తోమత కొద్ది అన్నదానం, వస్త్రదానం, ధాన్యం, పండ్లను దానం చేయాలి.

    Guru Purnima 2026 date dos donts on pournami know details
    Guru Purnima 2026 date dos donts on pournami know details

    Guru Purnima 2026: పౌర్ణమి రోజు చేయకూడని పనులు..

    ఇక పౌర్ణమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇతరులను అసభ్యకర పదజాలంతో దూషించకూడదు. కఠినమైన మాటలు మాట్లాడకుండా గొడవలకు వాదనలకు దిగకపోవడం మంచిది. ఇక పౌర్ణమి రోజు విష్ణు దేవుడిని ఆరాధించడం, పూర్తిగా సాత్విక ఆహారం తీసుకుంటూ, మద్యం మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇతరులకు కీడు , నష్టం కలిగించే పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజు భక్తిశ్రద్ధలతో దైవచింతనలో ఉండటం మంచిది.