Vastu Tips: ఇటీవల కాలంలో ఎంతోమంది పెద్ద ఎత్తున దాన ధర్మాలను చేస్తూ ఉన్నారు. ఇలా దానధర్మాలు చేయటం వల్ల మనలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడమే కాకుండా మనకు కాస్త పుణ్య ఫలం లభిస్తుందని అందరూ భావిస్తూ ఉంటారు. అందుకే వారి స్థోమతకు అనుగుణంగా దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా దానం చేసేటప్పుడు డబ్బును దానంగా చేస్తూ ఉంటారు లేకపోతే మరికొన్ని వస్తువులను దానం చేస్తూ ఉంటారు.
మనం దానం చేసేటప్పుడు డబ్బు కాకుండా డబ్బు స్థానంలో ఈ వస్తువులను కనుక దానం చేస్తే మనకు ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. డబ్బుకు బదులు స్వయంగా మనమే ఆహారం తయారు చేసుకొని ఆ ఆహారాన్ని నలుగురికి పెట్టడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఇక దానం చేసేటప్పుడు నల్లని దుప్పటిని కనుక దానం చేయడంతో శని ప్రభావ దోషాలు మొత్తం తొలగిపోయి శని అనుగ్రహం మనపై ఉంటుంది.
ఇక బుధవారం రోజు ఆకుపచ్చ పండ్లు దానం చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. రాహు, కేతు వంటి గ్రహాలను శాంతింప చేయడంలో దుస్తులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు మనశ్శాంతి, కర్మలతో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి దుస్తులను దానం చేస్తే మనశ్శాంతి లభిస్తుందని చాలామంది చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే సోమవారం రోజు పాలు దానం చేయడం వల్ల మనసులోని భయం, గందరగోళం దూరం అవుతాయని వేద పండితులు చెబుతున్నారు.