Dhanush : గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ గురించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రెండేళ్ల క్రితమే తాము విడిపోతున్నామంటూ ప్రకటించి ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. రీసెంట్ గానే ధనుష్, ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ కోర్టులో డివోర్స్ కోసం అఫీషియల్ గా అప్లై చేశారు. అయితే ఇన్నాళ్లు వీరిద్దరూ ఎలాగైనా కలుస్తారని ఎదురుచూసిన ఫ్యాన్స్ బాగా అప్సెట్ అయ్యారు.దాదాపు 18 ఏళ్లు హ్యాపీగా ఉన్న ఈ స్టార్ జంట విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. ముందు ధనుష్ , ఐశ్వర్య డివోర్స్ తీసుకుంటున్నారంటే ఎవరూ నమ్మలేదు. రూమర్ లా కొట్టి పారేశారు. అందులోనూ ఇటు ధనుష్, అటు ఐశ్వర్య వారి వారి వర్క్స్ లో బిజీగా మారిపోయారు. ధనుష్ యూనిక్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తుంటే.. ఐశ్వర్య డైరెక్టర్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే రజనీకాంత్ తో కలిసి ఐశ్వర్య లాల్ సలామ్ అనే మూవీ చేసింది. ఇక వీరిద్దరూ విడిపోవడం కన్ఫామ్ కావడంతో ఇప్పుడు పిల్లల బాధ్యత ఎవరిది అన్న టాపిక్ ఆసక్తికరంగా మారింది . పిల్లలు ఎవరి దగ్గర ఉంటారనేది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

పిల్లలు ఐశ్వర్య దగ్గరే ఉంటారని తాజా సమాచారం. అంతే కాదు పిల్లలు తన దగ్గరే ఉండాలని, వారిని పోషించే బాధ్యత తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ కూడా చేశారు. ఈ విషయంలో ఐశ్వర్య. ఫుల్ క్లారిటీతో ఉన్నారట. మరి ధనుష్ ఎలాంటి రిప్లై ఇస్తాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ . తండ్రి సినిమా ఫీల్డ్ కావడంతో తన కెరీర్ ను కూడా అక్కడే మొదలుపెట్టింది. కొన్నేళ్లుగా ఫిల్మ్ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉంటోంది ఐశ్వర్య. ‘3’మూవీతో ఐశ్వర్య డైరెక్టర్ గా మారింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా, స్టార్ హీరోయిన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక పర్సనల్ విషయానికి వస్తే ధనుష్, ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది 18 ఏళ్ల బంధం. వీరికి యాత్ర, లింగ అనే పిల్లలు ఉన్నారు. మొదటి కొడుకు యాత్రకు 18 ఏళ్లు. చిన్నకొడుకు లింగాకి 14 ఏళ్లు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట ఇప్పుడు విడిపోయింది. త్వరలో డివోర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.