Boney Kapoor : ముసలోడే కానీ మామూలోడు కాదురా బాబు అనే కామెంట్ కరెక్ట్ గా బాలీవుడ్ బడా నిర్మాత , దివంగత నటి శ్రీదేవీ భర్త బోనీకపూర్ కి సెట్ అవుతుందని అంటున్నారు నెటిజన్స్. తాజాగా బోనీ చేసిన ఓ పని చూసి నెటిజన్స్ ఛీ కొడుతున్నారు. శ్రీదేవి భర్తగా, నిర్మాతగా టాలీవుడ్ , బాలీవుడ్ లో బోనీకపూర్ ప్రత్యేక ఇమేజ్ ఉంది. కానీ ఆ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా అతని ప్రవర్తన ఉందంటూ ప్రజలు ఆయన్ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. బోనీకపూర్ ఇండస్ట్రీ పరువు తీస్తున్నారంటూ కామెంట్ల రూపంలో తిట్టిపోస్తున్నారు. ఇంతలా జనం ఛీ కొట్టడానికి కారణం లేకపోలేదు అదేమిటి మీరు చూడండి.

రీసెంట్ గా ముంబైలో బి-టౌన్ సెలబ్స్ కోసం ప్రత్యేకంగా ‘మైదాన్’ మూవీ స్క్రీనింగ్ జరిగింది. ఈ ఈవెంట్ కు మూవీ ప్రొడ్యూజర్ బోనీ కపూర్ సహా చిత్ర యూనిట్ అంతా హాజరైంది. స్టార్ సెలబ్రిటీస్ కూడా స్క్రీనింగ్ కు వచ్చారు. ఈ మూవీ హీరోయిన్ ప్రియమణి ఈవెంట్ లో హైలెట్ గా నిలిచింది. నలుపు రంగు చీరలో ప్రియమణి చాలా అందంగా కనిపించింది. కార్యక్రమానికి ముందే బోనీకపూర్ స్క్రీనింగ్ థియేటర్ బయట గెస్టులకు ఆహ్వానం పలుకుతూ వారితో చిట్ చాట్ చేస్తున్నాడు. సరిగ్గా అదే టైమ్ లో ప్రియమణి ఈవెంట్ కు వచ్చింది. దీంతో బోనీ కపూర్ ప్రియమణికి వెల్కమ్ చెప్పాడు. ఫొటోగ్రాఫర్లకు ఫోటోలు కూడా ఇచ్చాడు. అయితే బోనీ కపూర్ ప్రియమణి, భుజంతో పాటు నడుము మీద చేయి వేసి ఫోటోలు దిగాడు. ప్రియమణి కూడా బోనీ తీరుతో కాస్త అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈవెంట్ లో బోనీ తీరు నెటిజన్లకు అస్సలు నచ్చడం లేదు. ప్రియమణిని అనుచితంగా తాకాడని సోషల్ మీడియాలో బోనీ కపూర్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఈ వయసులో ఇవేం పనులు అంటూ తిట్టిపోస్తున్నారు.

బోనీ కపూర్ చేసిన పనిపై ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు.” ఈ వయసులో ఓ హీరోయిన్ తో ఇలా మిస్ బిహేవ్ చేస్తాడని అసలు నేను ఊహించలేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తండ్రి ఇంత నీచంగా ఎలా బిహేవ్ చేస్తాడుఉంటాడు? ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం”అని ఫైర్ అయ్యాడు. ఇక మరో నెటిజన్ ముసలోడివి, సిగ్గు లేదా? అని రాసుకొచ్చాడు. బోనీ తీరుపై నెటిజన్స్ మండిపడటం ఇది ఫస్ట్ టైమ్ కాదు. 2023లో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా జిగి హడిద్ నడుముపై చేయి వేసి ఫోటోలకు పోజులిచ్చాడు, అప్పుడు కూడా నెటిజన్లు బోనీపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బోనీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ పిక్స్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి .
