Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీ పుష్ప 2. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి వచ్చే ప్రతి అప్డేట్ బన్నీ ఫ్యాన్స్ కు వేరేలెవెల్ కిక్ అందిస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాస్ మెస్మరైజింగ్ యాక్టింగ్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలరించింది. దీంతో పుష్ప2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. రీసెంట్ గా బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన టీజర్ గూస్ బమ్స్ తెప్పించాయి. చీరకట్టుకుని బన్నీ తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అటు చిత్ర యూనిట్ కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్టు 15 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. మొత్తానికి ఈ మూవీ ప్రభంజనం సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన మరో అప్ డేట్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుష్ప2లో భాగంకానున్నారన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేసేస్తోంది.
అల్లు అర్జున్ ఏం చేసినా యూనిక్ గా ఉండాలని అనుకుంటాడు. తను చేసే ప్రతి సినిమాలో కంటెంట్ మాత్రమే కాదు తన లుక్ కూడా అదే విధంగా మార్చుకునేందుకు తన ఎఫోర్ట్స్ పెడతాడు. స్టోరీకి తగ్గట్లుగా తనను తాను మలుచుకుని బొమ్మను హిట్ చేస్తాడు. అందుకే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తన సొంతం కష్టంతోనే ఇప్పుడు ఐకానిక్ స్టార్ గా మారాడు. అందులోనూ బన్నీకి పుష్ప మూవీ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆ సినిమాతోనే బన్నీ నేషనల్ స్టార్ అయ్యాడు. జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక పుష్ప 2ను అంతే కసితో చేసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు బన్నీతో పాటు మేకర్స్ తీసుకుంటున్నారు. సినిమాపై హైప్ విపరీతంగా రావడంతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేందుకు ఏదైనా భిన్నంగా ట్రై చేద్దామని అనుకున్నారు కాబోలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
అదేమిటంటే పుష్ప2లో బన్నీ మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భాగం కానున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తారా అని అనుకుంటున్నారు కదా. అలా అయితే కాదు కానీ…పవన్ తన వాయిస్ ఇవ్వబోతున్నాడట. ఇంట్రడక్షన్ సీన్ లో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ మొదట్లో కొన్ని డైలాగులను పవన్ చెప్పబోతున్నాడట . దీంతో ఈ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.