Custard Apples:వర్షాకాలం మొదలవడంతో మనకు మార్కెట్లో విరివిగా సీతాఫలాలు లభిస్తాయి. ఇలా వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ సీతాఫలాలను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే చాలామంది ఇందులో ఉన్నటువంటి విత్తనాలను తీసి తినడానికి బద్ధకం అయ్యి ఈ పండ్లను తినడానికి ఇష్టపడరు. అయితే ఈ పండ్లను కనుక దూరం పెట్టారు అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం దూరం చేసుకున్నట్లే. మరి సీతాఫలంలో దాగి ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
సీతాఫలంలో కాల్షియమ్,విటమిన్ సి, పీచు పదార్ధం, కెరోటిన్, థైమీన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. అయితే ఇన్ని పోషక విలువలు కలిగినటువంటి ఈ సీతాఫలాన్ని ఎప్పుడు కూడా మనం పరగడుపున తినకూడదు.ఈ ఫలం ఎప్పుడూ కూడా భోజనం చేసిన తర్వాత తినడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటినీ మనం సొంతం చేసుకోవచ్చు.సీతాఫలం తిన్న తర్వాత మంచినీళ్లను అధికంగా తాగటం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
Custard Apples
ఇందులో పీచు పదార్థాలు కూడా ఉండటం వల్ల ఈ పండును ప్రతిరోజు ఒకటి తినడం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జీతక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుచుకోవచ్చు. పొటాషియం అధికంగా ఉండడంతో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఇక విటమిన్ ఏ కారణంగా కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.గుండె జబ్బులు ఉన్నవారు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.దీన్ని అల్పాహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.సీతాఫలం మాత్రమే కాకుండా దీని ఆకులు ఫలం లోని విత్తనాలు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి.