Thu. May 14th, 2026

    TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన స్టైల్ ఏమాత్రం మారలేదు. తాను నిద్రపోరు.. అవతలి వారిని నిద్రపోనివ్వరు అనే పేరు ఆయనకు ఉంది. అయితే ఈ పని రాక్షసుడు బయటి వారికే కాదు, తన సొంత కుమారుడు, మంత్రి నారా లోకేష్‌కు కూడా చమటలు పట్టిస్తున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

    సాధారణంగా ఏదైనా పెద్ద విజయం సాధించినప్పుడు ఎవరైనా సరే కాస్త రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబు డిక్షనరీలో ఆ మాటే లేదంటున్నారు లోకేష్. తాజాగా సిఐఐ నిర్వహించిన ఒక సదస్సులో లోకేష్ తన తండ్రి పనితీరుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. “మేము ఏదైనా విజయం సాధిస్తే.. కనీసం ఐదు నిమిషాలు కూడా ఆ సంతోషాన్ని అనుభవించే ఛాన్స్ ఆయన ఇవ్వరు. ఒక లక్ష్యం పూర్తి కాగానే, వెంటనే మరో పెద్ద టార్గెట్‌ను మన ముందు పెడతారు” అంటూ లోకేష్ నవ్వుతూనే తన కష్టాన్ని చెప్పుకొచ్చారు.

    chandrababus-rules-are-different-he-didnt-even-spare-lokesh
    chandrababus-rules-are-different-he-didnt-even-spare-lokesh

    TDP PARTY: కీలక అంశాలపై లోకేష్‌కు దిశానిర్దేశం చేశారట చంద్రబాబు.

    లోకేష్ తన బిజీ షెడ్యూల్ గురించి వివరిస్తూ ఒక ఆసక్తికర ఉదాహరణ చెప్పారు. ప్రధాని మోదీ పర్యటన ముగించుకుని, వెంటనే సింగపూర్ వెళ్లి, అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా అస్సాం వెళ్లాల్సిన టైంలో కూడా బాబు నుంచి ఆదేశాలు ఆగలేదట. కేవలం 4 గంటల ప్రయాణ వ్యవధిలో ఏకంగా 22 కీలక అంశాలపై లోకేష్‌కు దిశానిర్దేశం చేశారట చంద్రబాబు. ఆ పనులన్నీ ఫాలో-అప్ చేయాలని ఆర్డర్ వేయడంతో లోకేష్ షాక్ అయ్యారట.

    ఈ ఉదంతం చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. పార్టీకి కాబోయే సారధి అయినా, తన కుమారుడైనా.. పని విషయంలో మాత్రం చంద్రబాబు ఎవరికీ రాయితీలు ఇవ్వరు. “ఆయనతో పని చేయడం చాలా కష్టం” అని లోకేష్ ఓపెన్‌గా చెప్పేశారంటే, బాబు పెడుతున్న టార్గెట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా, తన కొడుకును కూడా ఒక సాధారణ కార్యకర్తలా, మంత్రిలా ఉరికిస్తున్న బాబు స్టైల్ చూసి నెటిజన్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.