Tue. Jul 8th, 2025

    Animal Movie Sequel : ఎప్పుడెప్పుడా అని ఆసక్తితో ఎదురుచూసిన “యానిమల్” మూవీ మొత్తానికి శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్, కండలవీరుడు బాబీ డియోల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన ఈ ఫాథర్ సెంటిమెంట్ మూవీ ట్విస్టులతో, ఇంట్రెస్టింగ్ సీన్స్ తో , అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన తండ్రిని చంపేందుకు ప్రయత్నం చేసిన వారిపై ఓ కొడుకు ప్రతీకారం తీర్చుకునే కథలో వచ్చింది యానిమల్. ఒకరకంగా యానిమల్ మూవీ ఓ హింసాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్. ‘A’ రేటింగ్ తో 3 గంటల 23 నిమిషాలు రన్ టైమ్ తో వచ్చిన ఈ మూవీ చాలా బీభత్సాన్ని సృష్టించింది.

    animal-movie-sequel-sandeep-reddy-vanga-revealed-second-partl-twist
    animal-movie-sequel-sandeep-reddy-vanga-revealed-second-partl-twist

    యానిమల్ సినిమా మొత్తం వయోలెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ, ఈ మూవీ ఓవరాల్ గా మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం యానిమల్ బాక్సాఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసే పనిలో నిమగ్నమైంది. దర్శకుడు సందీప్ వంగ ముందు నుంచీ టీజర్, ట్రైలర్ లోనే కథ మొత్తం చూపించేశాడు. లవర్ బాయ్ అయిన రణబీర్ కపూర్‌ ను కొత్తగా చూపించి అభిమానుల మనసు దోచేశాడు. సినిమా కథ తెలిసినప్పటికీ విపరీతమైన ట్విస్ట్ లు, ఆసక్తికమైన సన్నివేశాలు, అద్భుతమైన క్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే అదనుగా భావించిన యానిమల్ మేకర్స్ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచేశారు.

    animal-movie-sequel-sandeep-reddy-vanga-revealed-second-partl-twist
    animal-movie-sequel-sandeep-reddy-vanga-revealed-second-partl-twist

    యానిమల్ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ ఉంటుందన్న విషయాన్ని మేకర్స్ ముందే అనైన్సౌ చేశారు. “యానిమల్” చిత్రం ప్రమోషన్స్ సమయంలో మూవీ యూనిట్ మొత్తం “అన్స్టాపబుల్” షోకు వచ్చారు. ఆ షోలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో రణబీర్ కపూర్, నటి రష్మిక మందన్న అటెంట్ అయ్యారు. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో సడెన్ గా “యానిమల్” మూవీకి సీక్వెల్ ఉంటుందని రణబీర్ నోరు స్లిప్ అయ్యారు. మళ్లీ ఏమీ తెలియనట్లు కవర్ చేసే ప్రయత్నం చేశాడనుకోండి అదే వేరే విషయం. ఇక లేటెస్టుగా మూవీ సీక్వెల్ ఉంటుందని మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రయటించింది. టైటిల్ తో సహా సీక్వెల్ ను రివీల్ చేసేసింది.

    animal-movie-sequel-sandeep-reddy-vanga-revealed-second-partl-twist
    animal-movie-sequel-sandeep-reddy-vanga-revealed-second-partl-twist

    “యానిమల్” మూవీ టీం తమ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో ‘యానిమల్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ మిస్ కావద్దు’ అని ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. ప్రేక్షకుల మైండ్ లో బాగా గుర్తుండిపోయే సీన్స్ ని సృష్టించాలనే క్రియేటివ్ ఐడియాతో మేకర్స్ ఈ సినిమా సీక్వెల్ ను పోస్ట్ క్రెడిట్స్ లో వేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సెకండ్ పార్ట్ టైటిల్ ను కూడా మూవీ మేకర్స్ రివీల్ చేశారు. “యానిమల్‌” సీక్వెల్‌కి “యానిమల్‌ పార్క్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. అంతే కాదు ఈ సీక్వెల్ లోనూ రణబీర్ కపూర్, రష్మిక మందన్న జోడీ రిపీట్ కానుంది.