Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా ఆలయంలో ప్రత్యేకించి పూజలు ఉత్సవాలు చేసే సమయంలో పెద్ద ఎత్తున డబ్బులు విరాళంగా అందిస్తూ ఉంటాము. ఇలా స్వామివారి ఆలయానికి డబ్బు విరాళంగా ఇవ్వడం వల్ల అన్ని శుభాలే కలుగుతాయని భావిస్తారు. అయితే ఆలయానికి ఇలా డబ్బు కాకుండా మరికొన్ని వస్తువులను విరాళంగా ఇవ్వడం వల్ల రెట్టింపు పుణ్యఫలం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఆలయానికి డబ్బు కాకుండా విరాళంగా ఇవ్వవలసిన వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే..
సాధారణంగా ఆలయాలలో పూజలు నిర్వహించిన అనంతరం డబ్బు దానం చేస్తారు కానీ డబ్బు కంటే కూడా ఆలయానికి ఆహార ధాన్యాలను విరాళంగా ఇవ్వడం శుభం. సనాతన ధర్మం ప్రకారం ఆలయాలలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అందుకే ఆలయాలకు డబ్బు కంటే ఆహార ధాన్యాలను విరాళంగా ఇవ్వటం వల్ల ఎంతో మంది ఆకలిని తీర్చిన వారు అవుతారు. దేవాలయాల పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఆలయాలకు నూతన వస్త్రములను దానం చేయటం వల్ల ఆ వస్త్రాలు అవసరంలో ఉన్నవారి గౌరవప్రదమైన జీవనానికి తోడ్పడుతుంది.

Temple Donation: దీపాలంకరణ కోసం నూనె..
దీపం జ్ఞానం, పవిత్రత, చీకటిపై వెలుగుకు ప్రతీక. అందుకే ఆలయాలలో దీపాలు వెలిగించడం కోసం నూనె దానం చేయటం కూడా ఎంతో శుభప్రదమైనది.ఈ దానంతో దేవాలయంలో దీపారాధన కొనసాగడమే కాకుండా, మన జీవితంలో అజ్ఞానం, ప్రతికూల ఆలోచనలు తొలగి సానుకూలత పెరుగుతుందనే నమ్మకం ఉంది. ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క ఆలయంలో కూడా గో సేవకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గో సేవలో భాగంగా గోవులకు కావలసిన పశుగ్రాసాన్ని కూడా విరాళంగా ఇవ్వడం మంచిది. ఇక స్వామివారి ఆలయాలలో చేసే సేవలో భాగంగా భక్తులు పాల్గొని స్వామి వారికి సేవలు చేయడం ద్వారా మరింత పుణ్యఫలం కలుగుతుంది. డబ్బు కంటే బదులుగా ఆహార ధాన్యాలు, వస్త్రాలు, నూనె ,గోసేవ వంటివి దానం చేయటం మంచిది.

