Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో సరైన తిండి నిద్రలేక ఎన్నో అనారోగ్య సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలోనే చాలామంది రాత్రిళ్ళు చాలా లేటుగా పడుకోవడం ఉదయమే త్వరగా నిద్ర లేవడం వంటివి జరుగుతున్నాయి. ఇలా మన శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా చాలామంది ఇలాంటి తప్పులను చేస్తుంటారు.
మన శరీరానికి ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర ఎంతో అవసరం. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల మన శరీరంలో కీలక మార్పులు చోటు చేసుకోవడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన నిద్ర మన శరీరానికి ఉన్నప్పుడు మనం మెదడు పని తీరు సక్రమంగా ఉంటుంది అలాగే మెదడులోని వ్యక్తపదార్థాలన్ని తొలగిపోయి కణాల పునరుత్పత్తి జరుగుతుంది. ఎప్పుడైతే శరీరానికి నిద్ర తక్కువ అవుతుందో మెదుడు పని తీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడు పనితీరు పెరిగి, పని పట్ల శ్రద్ధ చూపడం ఏకాగ్రత వంటివి సరిగ్గా జరగాలి అంటే నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది.

Health Care: రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం..
మన శరీరానికి సరిపడా నిద్ర లేనప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి రక్త పోటు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక శరీర బరువు కావడం తద్వారా టైప్ 2 డయాబెటిస్ బారిన పడటం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. సరైన నిద్ర లేకపోవడం జీర్ణ వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది తద్వారా జీర్ణక్రియ సమస్యలతో పాటు మలబద్ధకం వంటి సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. సరైన నిద్ర లేకపోవడం అనేది మానసిక ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంది. వీలైనంతవరకు రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేవడానికి ప్రయత్నాలు చేయాలి వీలైనంతవరకు మొబైల్ ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్ వంటి వాటిని దూరంగా పెట్టడం మంచిది.

