Thu. Jun 11th, 2026

    Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటుంది. ఇక మహిళలలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్లు అధికమవుతున్నాయి. ఇలా రొమ్ము క్యాన్సర్ల బారిన పడి ప్రతి ఏడాది చాలా మంది మరణిస్తున్నారు. అయితే మహిళలలో ఘననీయంగా పెరుగుతున్న ఈ రొమ్ము క్యాన్సర్లను మొదటి దశలోనే గుర్తిస్తే పెద్ద ప్రమాదం నుంచి బయటపడవచ్చు. చాలామంది క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేకపోవడం వల్లే ప్రమాదం పెరుగుతుంది. అయితే మహిళలు ఈ రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడాలి అంటే ఈ విషయాలను కనుక గుర్తిస్తే మొదటి దశలోనే క్యాన్సర్ మహమ్మారిని అణిచివేయవచ్చు.

     

    మహిళలలో రొమ్ము క్యాన్సర్ ను సూచించే లక్షణాలు ఏంటనే విషయానికి వస్తే.. మహిళలు రొమ్ము భాగం లేదా చంకలలో ఏదైనా గడ్డలు కనిపించి అవి నొప్పిగా ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టయితే కొంతమందిలో రొమ్ము భాగం నొప్పితో పాటు రొమ్ము ఆకృతి కూడా మారుతుంది. చర్మం మొత్తం ఎర్రబడి, రొమ్ము పైచర్మం ముడతలు పడటం, పొలుసులు రాలడం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే రొమ్ము నుంచి రక్తం, ఇతర ద్రవాలు వెలువడినట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

    Womens must know these facts about breast cancer know more details
    Womens must know these facts about breast cancer know more details

    Breast Cancer: జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు..

    రొమ్ము క్యాన్సర్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. ముఖ్యంగా 45 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్క మహిళ కూడా ముందస్తు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇక జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రొమ్ము భాగంలో ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఇక 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆధునిక పద్ధతులలో క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉండటంవల్ల మొదటి దశలోనే గుర్తిస్తే ఎలాంటి ప్రమాదం లేకుండా ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు.