Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలనలో బిజీగా ఉన్నప్పటికీ, అటు పార్టీని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తాజా సమావేశంలో పవన్ కల్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేనను సంస్థాగతంగా సమూలంగా మార్చేందుకు ‘7 మెంబర్స్ ఫార్ములా’ను తెరపైకి తెచ్చారు.
సాధారణంగా ఏ పార్టీలోనైనా జంబో కమిటీలు వేస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం రూట్ మార్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కేవలం ఏడుగురు సభ్యులతో కూడిన ఒక పవర్‌ఫుల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడుగురి టీమ్‌లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ లీడర్లు, మహిళా ప్రతినిధులకు చోటు దక్కనుంది. పార్టీలో కీ రోల్ ప్లే చేయబోయే ఈ 7 మెంబర్స్ కమిటీలు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ భవిష్యత్తును డిసైడ్ చేయనున్నాయి.

Andhra Pradesh: జనసేనలో ఎలాంటి కొత్త జోష్ తీసుకురాబోతుందో
ఈ కొత్త కమిటీల్లో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్‌ను యాడ్ చేశారు పవన్ కల్యాణ్. 2014 నుంచి పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన నాయకులతో పాటు, ప్రతి కమిటీలో ఇద్దరు సాధక్‌లకు ప్రత్యేకంగా స్థానం కల్పిస్తున్నారు. వీరికి సపోర్ట్‌గా మరో 10 నుండి 25 మంది సాధక్‌లతో ఒక సమన్వయ బృందం బ్యాక్ ఎండ్‌లో పని చేయబోతోంది. అంటే గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ కోసం కష్టపడే డెడికేటెడ్ లీడర్లను గుర్తించి వారికి హైప్రాధాన్యత ఇవ్వడమే ఈ సాధక్ కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కమిటీల ఏర్పాటు, కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకంపై ఈ 7 సభ్యుల కమిటీలదే కీ రోల్. అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు, డాక్యుమెంట్లు స్వీకరించి, వాటిని వడపోసి పవన్ కల్యాణ్‌కు తుది నివేదిక ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని హైకమాండ్ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. అయితే ఈ హడావుడి నెలల తరబడి సాగడానికి వీల్లేదని, కేవలం నాలుగు వారాల్లోనే ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. ఈ బిగ్ చేంజ్ జనసేనలో ఎలాంటి కొత్త జోష్ తీసుకురాబోతుందో చూడాలి.

