Wed. Jul 15th, 2026

    Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఇప్పటికే ఎన్నో విధాలుగా దర్శన సౌకర్యాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్వామి వారి దర్శనాలలో భాగంగా విరాళాలు ఇచ్చే భక్తుల విషయంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది.టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాత‌ల‌కు కల్పించే ప్రివిలేజెస్‌లో(విశేషాధికారాలు) ప‌లు మార్పులు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు వెల్లడించారు.విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి తెచ్చేందుకు మార్పులు చేసినట్లు తెలియజేశారు.

     

    ఈ కొత్త నిబంధనలు నేటి (జూలై 15)నుంచి అమలులోకి రాబోతున్నాయి. గతంలో స్వామివారి దర్శనంలో భాగంగా లక్ష రూపాయలు విరాళాలు ఇచ్చే భక్తులకి ప్రస్తుతమున్న ప్రివిలేజెస్ కొనసాగుతాయని ఇప్పటినుంచి లక్ష రూపాయలు విరాళం అందించే భక్తులకు ఈ సదుపాయాలు 20 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటాయని తెలియజేశారు. లక్ష రూపాయల విరాళం అందించే వారితో పాటు మిగతా డోనర్స్ కి కూడా ఈ సదుపాయాలను నేటి నుంచి కల్పించబోతున్నట్లు తెలియచేశారు.

    TTD makes changes in donors privilege in tirumala know more details
    TTD makes changes in donors privilege in tirumala know more details

    Tirumala: లక్ష కాదు 2 లక్షలు ఇవ్వాలి..

    ఇలా లక్ష రూపాయలు విరాళం అందించే భక్తులకు ఇదివరకు సుపథం పథకం ద్వారా దర్శనం కల్పించేవారు. అయితే ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని తీసివేసి లక్ష రూపాయలు విరాళం అందించిన వారిని కూడా 300 టికెట్ లైన్ లోనే దర్శనానికి పంపించబోతున్నట్లు తెలియచేశారు. ఇకపై సుపథం దర్శనం కావాలి అంటే రెండు లక్షల రూపాయలు విరాళం అందించాలని ఈ సందర్భంగా టీటీడీ తెలియచేసింది. ఈ సమావేశంలో భాగంగా స్వామివారి భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించడం కోసం టెండర్లకు ఆమోదం తెలిపారు. అదే విధంగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తుల కోసం తిరుమలలో రూ.6.31 కోట్లతో ఆళ్వార్ ట్యాంక్ స‌మీపంలో షెల్టర్లు, క్యూలైన్లు, మ‌రుగుదొడ్లు నిర్మించనున్నామని, కుమారధార, పసుపుధార డ్యామ్‌లను మరింత ప‌టిష్ట పరిచేలా డబుల్ లేన్ వంతెన నిర్మాణం కోసం రూ.2.77 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.