Wed. May 13th, 2026

    Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తిరిగి తన విధుల్లో చేరబోతున్నారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో పాలనపై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. కేవలం పార్టీ శ్రేణుల్లోనే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంలోనూ పవన్ రాక ఒక కొత్త ఊపును తీసుకొస్తోంది.

    నేడు ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్ గన్నవరం బయలుదేరారు. ఉదయం 10:40 గంటలకు ఆయన ఏపీ గడ్డపై అడుగుపెట్టనున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు జనసైనికులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వరకు రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణం సాగనుంది. ఈ క్రమంలో దారిపొడవునా జనసేనానిపై పూలవర్షం కురిపించేందుకు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.

    ap-deputy-cm-pawan-kalyan-on-duty
    ap-deputy-cm-pawan-kalyan-on-duty

    Pawan kalyan: ఎన్నికల తర్వాత పవన్ తనదైన ముద్ర వేస్తూ పాలనలో బిజీగా మారారు

    పవన్ కల్యాణ్ గైర్హాజరీలో పలు శాఖల పనులు నెమ్మదించాయని భావిస్తున్న తరుణంలో, నేడు ఉదయం 11:30 గంటలకు కార్యాలయానికి చేరుకోగానే ఆయన కీలక సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్త పర్యటనలకు కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

    కాగా, ఎన్నికల తర్వాత పవన్ తనదైన ముద్ర వేస్తూ పాలనలో బిజీగా మారారు. మధ్యలో వచ్చిన ఈ చిన్న గ్యాప్ తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఏ ఏ అంశాలపై ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా, డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ అనే వార్త జనసేన శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.