Thu. Nov 13th, 2025

    Dream: పడుకున్నప్పుడు నిద్రలో కలలు రావడం అన్నది ఈ సహజం. అందులో కొన్ని మంచి కలలు ఉంటే మరి కొన్ని చెడ్డ కలలు ఉంటాయి. కాగా స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయి అని చెబుతూ ఉంటారు. అలాగే మనం నిద్రపోయే సమయంలో ఏ విషయం గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామో అలాంటి కలలే మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా కొన్ని కొన్ని సార్లు మనకు కలలో పాములు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది కలలో పాములు కనబడినప్పుడు తెగ భయపడిపోతూ ఉంటారు.

    why-snakes-come-often-in-dreams-interpretation
    why-snakes-come-often-in-dreams-interpretation

    మరి స్వప్న శాస్త్ర ప్రకారం కలలో పాములు కనిపిస్తే ఏం జరుగుతుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ కలలో ఎప్పుడో ఒకసారి పాము కనిపిస్తే ఫర్వాలేదు కానీ తరచు పాములు కనపడితే ? సాధారణంగా, పాముల గురించి పునరావృతమయ్యే కలలు మీరు విస్మరిస్తున్న మీ జీవితంలోని అంశాలను సూచిస్తాయని పండితులు చెబుతున్నారు. ఎవరైనా మీ జీవితంలో ఎవరైనా విషపూరితంగా వ్యవహరిస్తారా అని చూడాలి. వారు మీ కలలో పాము రూపంలో ఉండవచ్చు. మీ ఉపచేతన ఈ వ్యక్తి ప్రవర్తనను విషపూరిత పాము రూపంలో ప్రదర్శిస్తుండవచ్చు. అదేవిధంగా మీరంటే నచ్చని వ్యక్తులు విషపూరితమైన వ్యక్తులు మీ చుట్టూ ఉంటే అలాంటి సమయంలో ఈ కలలో పాము కనిపిస్తూ ఉంటుంది.

    అలాంటి వారు ఎవరు అనేది తెలుసుకోలేకపోతే కలలో కొన్ని రకాల సంకేతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు పాము తలను నరికివేయాలని లేదా చంపాలని కలలుగన్నట్లయితే, మీ ఉపచేతన మనస్సు ఈ వ్యక్తిని మీ జీవితం నుండి తొలగించమని చెబుతుందని అర్థం. మీ కలలోని పాములు మీ నైరూప్య భయాన్ని సూచిస్తాయి. మానవులకు పాములపై జన్యుపరమైన భయం ఉంటుంది. మీరు మీ పూర్వీకుల నుండి ఈ భయాన్ని వారసత్వంగా పొంది ఉండవచ్చు. ఎందుకంటే ఆదిమ కాలంలో మానవులకు పాములు చాలా ప్రమాదకరంగా ఉండేవి. ఆ ప్రాథమిక భయం ఇప్పటికీ మీలో ఉండవచ్చు. ప్రతిరోజూ ధ్యానం చేయడం, బుద్ధి పూర్వకంగా ఉండటం, ఇంటిని శుభ్రం చేయడం, ప్రతిరోజూ మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను రాయడం, స్నేహితులతో మాట్లాడటం, కౌన్సెలింగ్ మొదలైనవి ఈ భయాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. ఒకవేళ కలలో బంగారు రంగు పాము కనిపిస్తే చాలా మంచిది అంటున్నారు పండితులు. అది ఆర్థిక సమస్యలకు సంకేతంగా భావించాలట. అంటే త్వరలో సమస్యలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పట్టిపీడించబోతుందని అర్థం.