Temple: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఆలయాలకు వెళ్లి మన ఇష్ట దైవారాధనను ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటాము. ఇలా తరచూ మనం ఆలయాలకు వెళ్లడం మన సాంప్రదాయంగా కూడా బాధిస్తూ ఉంటాము అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది భక్తులు ఎన్నో నియమ నిష్ఠలను పాటిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించడానికి కంటే ముందుగా స్వామివారి గడపకు నమస్కరించి ఆలయంలోకి అడుగు పెడతారు.
ఇలా చాలామంది ముందు స్వామివారి ఆలయ గడపను నమస్కరించి ఆలయంలోకి వెళ్తుంటారు అలా ఎందుకు వెళ్తారో తెలియదు కానీ నమస్కరించి వెళ్తూ ఉంటారు మరి ఎందుకు మనం ఆలయ గడపను నమస్కరించి ఆలయంలోకి అడుగుపెడతాము అనే విషయాన్ని వస్తే.. సాధారణంగా మనం మన ఇంటికి వేసుకునే గడప చెక్కతో తయారు చేసే ఉంటుంది కానీ ఆలయానికి మాత్రం రాతితో గడప తయారు చేసి ఉంటుంది.
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే భక్తుల కోసం భగవంతుడు కొండపైన వెలిశారు. అయితే ఆలయానికి గడప తయారు చేయడానికి ఆ కొండ నుంచి రాయిని తీసుకొస్తారు కనుక సాక్షాత్తు ఆ భద్రుడే ఇక్కడ ఉన్నారని భావించి నమస్కరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆలయం గడప నిత్యం భగవంతుడిని దర్శిస్తూ పుణ్యం చేసుకొని ఉంటుంది కనుక మనం ఆలయ ప్రవేశం చేసే ముందు ఆ గడపకు నమస్కారం చేయడం మంచిదని భావించి చేస్తూ ఉంటారు.