Thu. Nov 13th, 2025

    WhatsApp: ప్రస్తుతం సోషల్ మెసెంజర్ సర్వీస్లలో వాట్సాప్ అనేది అగ్రస్థానంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక శాతం ప్రజలు వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. సందేశాలతో పాటు ఫోటోలు, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్ ఫైల్స్ ని కూడా వాట్సాప్ ద్వారా ఇతరులకు షేర్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే గూగుల్ మ్యాప్ ని కూడా వాట్సప్ కి షేర్ చేసి మనం ఎక్కడ ఉన్నాము ఆ లొకేషన్ కి కావాల్సిన వారు వచ్చేలా రెకమెండ్ చేయవచ్చు. ఇలాంటి సర్వీసుల కారణంగా వాట్సాప్ అత్యంత ఉపయోగకరమైన ఫ్యూచర్ గా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి మారిపోయింది.

    WhatsApp new features: Five upcoming WhatsApp features you should be  excited about

    ఎప్పటికప్పుడు మెటా సంస్థ ఈ వాట్సాప్ ఫీచర్లలో చాలా మార్పులు తీసుకొస్తూ అప్డేటెడ్ వెర్సన్స్ అందిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాట్సాప్ సెట్టింగ్స్ లో సెర్చ్ బార్ ఆప్షన్ ని తీసుకురాబోతున్నారు. ఈ సెర్చ్ భారత్ ద్వారా సెట్టింగ్స్ లో కావాల్సిన అంశాన్ని నేరుగా వెతికే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం వాట్సప్ బీటా వెర్షన్ లో ఈ సెర్చ్ బార్ ఐకాన్ కనిపిస్తోంది. ఈ ఐకాన్ ని ఉపయోగించి సెట్టింగ్స్ సెర్చ్ చేయవచ్చు.

    WhatsApp adding new feature for iOS, desktop clients to get this. Read here  | Mint

    ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఆప్షన్ త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సప్ టెక్ నిపుణులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఒకే వాట్సాప్ రెండు మూడు స్మార్ట్ ఫోన్లలో కూడా వినియోగించుకునే విధంగా కొత్త వెర్షన్లు తీసుకువచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ ఫీచర్ ద్వారా మెయిన్ వాట్సాప్ ఉన్న మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన కూడా యూజర్స్ కి నోటిఫికేషన్ అలర్ట్స్ అందే విధంగా ఫీచర్స్ డెవలప్ చేస్తూ ఉన్నారు.