Unique Brain Surgery : ఆధునిక యుగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సదుపాయాలతో ఎలాంటి రోగారికైనా సరే చికిత్స అందించగలమని నేటి కాలం వైద్యులు నిరూపిస్తున్నారు. ఎంతో అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ నిండు ప్రాణాలను కాపాడుతున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలకు సైతం ఊపిరి అందించి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో యునైటెడ్ స్టేట్స్‌లోని వైద్యుల బృందం ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించింది తల్లి గర్భంలో ఉన్న శిశువు మెదడులోని అరుదైన రక్తనాళ రుగ్మతకు చికిత్స చేసి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారు.
తాజాగా అమెరికా వైద్యులు అరుదైన చికిత్స చేసి రికార్డు సృష్టించారు. తల్లి గర్భంలో ఉన్న 30 వారాల శిశువు మెదడుకు విజయవంతంగా సర్జరీ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. బోస్టన్‌లోని పిల్లల ఆసుపత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. వివరాల్లోకి వెళ్తే సాధారణ వైద్యపరీక్షల్లో భాగంగానే తల్లిగర్భంలోని 30 వారాల శిశువు మెదడులో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే..ఓ గర్భిణీ సాధారణ వైద్యపరీక్షలు చేయించుకుంటున్న సమయంలో ఆమె గర్భంలోని 30 వారాల వయసు శిశువు బ్రెయిన్ లో ఎదో సమస్య ఉన్నట్లు డాక్టర్లకు తెలిసింది. శిశువు మెదడులో చాలా రేర్ రక్తనాళాల ప్రాబ్లెమ్ ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ శిశువు పుడితే ఆ శిశువు హార్ట్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ డెడ్ అవుతుందని జరగబోయే ప్రమాదాన్ని వైద్యులు ముందే పసిగాట్టారు. ఈ కేసు ప్రపంచంలోనే చాలా అరుదైనది. ఇలాంటి కేసుల్లో శిశువు జీవించడం చాలా అరుదు. అయినప్పటికీ వైద్యులు ఛాలెంజింగ్ గా తీసుకుని తల్లి గర్భంలోనే సర్జరీ చేశారు.
34 వారాలు ఉన్న గర్భస్థ శిశువుకు డాక్టర్స్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. కొద్దిరోజుల తర్వాత బిడ్డ జన్మించిందని, పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.