Wed. Jun 17th, 2026

    Tirumala: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా లక్షలాదిమంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం ఎన్నో సేవలను టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇకపై భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏకంగా మొబైల్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యానికి కూడా టీటీడీ అమలు చేస్తోంది.

    స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఇప్పటికే ఉచిత భోజనంతో పాటు పాలు వంటి సౌకర్యాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం టీటీడీ మొబైల్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆలయ పరిసర ప్రాంతాలలో దాహంతో ఉన్నవారి దప్పికను తీర్చడం కోసమే ఈ మొబైల్ డ్రింకింగ్ వాటర్ ను అమలు చేస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే వారు డిహైడ్రేట్ కాకుండా ఉండటం కోసం ఈ విధమైనటువంటి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

    TTD mobile drinking water service for devotees know details
    TTD mobile drinking water service for devotees know details

    Tirumala: మొబైల్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం..

    ఇలా మొబైల్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యాన్ని ఏర్పాటు ద్వారా పరిశుభ్రమైన నీటితో ఎంతోమంది భక్తుల దాహాన్ని తీర్చడం జరుగుతుంది. ఇలా భక్తుల కోసం టీటీడీ ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందిస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సేవలో పాల్గొనే భక్తుల ద్వారా ఇలాంటి సౌకర్యాన్ని కల్పించటం గమనార్హం. ఇలా ప్రతిరోజు తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టిటిడి సరికొత్త నిర్ణయాలను తీసుకుంటూ అన్ని ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు.