Vastu Tips: సాధారణంగా మన హిందువులు ఎన్నో రకాల ఆచార సంప్రదాయాలను ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు అలాగే వాస్తు నియమాలను కూడా అనుసరిస్తూ ఉంటారు. మన జీవితంలో సంతోషంగా ఉండటానికి ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. ముఖ్యంగా మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వాస్తు దోషాలు ఉన్న లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోయినా వాస్తు పరిహారాలను పాటించటం వల్ల ఈ సమస్యల నుంచి మనం పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఎన్నో రకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు కనుక వెంటాడుతూ ఉన్నట్లయితే ఈ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందడం కోసం ఇంట్లో గోమతి చక్రాలను పెట్టడం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మన హిందూ శాస్త్రం ప్రకారం గోమతి చక్రాలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ గోమతి చక్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సిరిసంపదలు కలుగుతాయి.
ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరిస్తుంది. కాబట్టి మీ పర్సులో కూడా గోమతీ చక్రాన్ని ఉంచుకుంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు. ఇక ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే పర్సులో ఒక చిన్న రావి ఆకులు పెట్టుకోవడం ఉత్తమం అదేవిధంగా చిన్న కవర్లో బియ్యం పోసుకొని మన పర్సులో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక తామర పువ్వు పై లక్ష్మీదేవి కూర్చుని ఉన్నటువంటి చిన్న ఫోటోని పర్సులో పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.