Tara Sutaria : బాలీవుడ్ తార తారా సుతారియా తనదైన శైలిలో ఫ్యాషన్ ను ఫాలో అవుతూ , బ్యూటీ ట్రెండ్‌సెట్టర్ గా నిలుస్తోంది ఇది అందరూ అంగీకరించే విషయం . విభిన్న రంగులు, విభిన్న ఫోటోలు తాజా పోకడలతో ప్రయోగాలు చేయడానికి నటి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఆమె శైలి ఎల్లప్పుడూ చిక్, క్లాసిక్, బోల్డ్ గా ఉంటాయి .
తాజాగా తారా సుతారియ తన లిటిల్ మెర్మైడ్ లుక్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆమె తాజా ఫోటోషూట్ పిక్స్ తో సరికొత్త ట్రెండీ సెట్ చేస్తోంది. ఫ్యాషన్ ప్రియులు ఆమె స్టైల్స్ ఫాలో అయ్యేందుకు తెగ ఆరాటపడుతున్నారు. తారా డిస్నీ ప్రిన్సెస్ చిత్రం నుండి ప్రేరణ పొందింది ఆమె స్పష్టమైన గాంభీర్యంతో దేశీ ట్విస్ట్ ఇచ్చింది. ఈ లుక్ లో తారా అద్భుతంగా కనిపించింది. ఒక అల్చిప్ప లో జలకన్య ఆకారంలో కూర్చొని కెమెరాకు ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్లో మంటలు రేపుతుంది.
తారా సుతారియా ఆమె స్టైలిస్ట్ మీగన్ కాన్సెసియో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లిటిల్ మెర్మైడ్ ఫోటో షూట్ చిత్రాలను పంచుకున్నారు. తారా పోస్ట్‌కి “అండర్ ది సీ” అని క్యాప్షన్ ఇవ్వగా, మీగన్ “లిటిల్ మెర్మైడ్” అని రాసింది . తారా తన స్టైలిస్ట్ పోస్ట్ కింద, “యు కెన్ కాల్ మి ఏరియల్” అని వ్యాఖ్యానించింది. తారా అభిమానులు ఆమె చిత్రాలకు ఆకర్షితులయ్యారు.
తారా ఫోటోషూట్ కోసం సీ-త్రూ కట్-అవుట్ బ్రాలెట్, ఫ్లోర్ స్వీపింగ్ స్కర్ట్‌ని ఎంచుకుంది. బ్రాలెట్ స్ట్రాప్‌లెస్ ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వస్తుంది, ఆమె డెకోలేటేజ్‌ను పెంచుతుంది. షెల్ అలంకారాలు, అసమానంగా కత్తిరించిన అంచు, కట్-అవుట్‌లు, బ్లౌజ్‌కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
తారా బ్రాలెట్‌ను ముత్యాల తెల్లటి రంగు స్కర్ట్‌తో జోడించింది. ఎత్తైన నడుము, ఫిగర్-హగ్గింగ్ డీటెయిల్స్ అమ్మడి అందాలను హైలెట్ చేస్తున్నాయి. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆభరణాలను ఎన్నుకుంది తారా. షెల్-అలంకరించిన చోకర్ నెక్లెస్, మెరిసేటి కిరీటం, పొడవాటి ఉంగరాలను కురులను లూస్ గా వదులుకొని తన లుక్ కి మరింత అట్రాక్షన్ జోడించింది.
చివరగా, తారా గ్లాస్ పిక్స్ కోసం నిగనిగలాడే మావ్ లిప్ షేడ్, మెరిసే ఐ షాడో, సొగసైన ఐలైనర్, కోహ్ల్-లైన్డ్ కళ్ళు, కనురెప్పల మీద బరువైన మాస్కరా, ముదురు కనుబొమ్మలు, బీమింగ్ హైలైటర్, డ్యూ బేస్‌ని ఎంచుకుంది. గ్లామర్ లుక్స్ తో యూత్ ను ఫిదా చేసింది.