Mon. Jul 14th, 2025

    SandeepReddy Vanga : రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండతో ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా తీసి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ హోదాను సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ ఒకే ఒక్క సినిమా తో బాలీవుడ్ లో మకాం వేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. హిందీ లోనూ అర్జున్ రెడ్డిని రీమేక్ చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్‌ రెడ్డి తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ రావడంతో రణబీర్ కపూర్ తో ‘యానిమల్‌’ సినిమాను చేస్తున్నాడు.

    sandeepreddy-vanga-planning-sequel-for-animal
    sandeepreddy-vanga-planning-sequel-for-animal

    యానిమల్‌ డిసెంబర్‌ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, పాటలు, ప్రోమోలను చూస్తే అర్థం అవుతుంది. యానిమల్‌ మూవీ నిడివి ఏకంగా 3.30 గంటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌత్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీ తో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము దులపడం ఖాయం అంటున్నారు ఎక్స్పర్ట్స్.

    sandeepreddy-vanga-planning-sequel-for-animal
    sandeepreddy-vanga-planning-sequel-for-animal

    యానిమల్ పై హై ఎక్సపెక్టేషన్స్ ఉండటంతో దర్శకుడు సందీప్ వంగ మరో సాహస నిర్ణయం తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొదటి పార్ట్‌ లో సీక్వెల్‌ కి సంబంధించిన లీడ్ ను ఇచ్చి సెకండ్ పార్ట్ ని చెప్తారట. యానిమల్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతోనే సీక్వెల్‌ ను కూడా ప్లాన్ చేశాడని సమాచారం.

    sandeepreddy-vanga-planning-sequel-for-animal
    sandeepreddy-vanga-planning-sequel-for-animal

    మొత్తానికి సందీప్ వంగ ఫుల్ ధీమాగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ని ను అనౌన్స్ చేశాడు. మరో వైపు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ తో కూడా ఒక మూవీ ని సందీప్ వంగ అనౌన్స్ చేశాడు. ఇప్పుడేమో యానిమల్‌ సినిమా సీక్వెల్‌ తీసేందుకు సై అంటున్నాడు. దీనిని బట్టి చూస్తే సందీప్ వంగ లైనప్ చూస్తే మామూలుగా లేదు.. యానిమల్‌ హిట్ అయితే ఇక ఈ డైరెక్టర్ మోస్ట్ వాంటెడ్‌ డైరెక్టర్ గా నిలిచే ఛాన్సులు ఉన్నాయి.